భుజం.. భుజం రాసుకుపూసుకు తిరిగినంత మాత్రాన స్నేహితులు అయిపోరు. డిజిటల్ యుగంలో స్నేహానికి నిర్వచనాలు మారిపోతున్నాయి. తాగించమని అడిగితే తాగించాలి.తినిపించమని అడిగితే తినిపించాలి. లేదంటే.. మేం అడిగితే తినిపించవా? అంటూ చంపేసే పాడు రోజులు వచ్చేశాయి. తాజాగా అలాంటి దారుణమే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. బిర్యానీ బిల్లు కట్టలేదని స్నేహితుడ్ని కొందరు యువకులు చంపేసిన వైనం సంచలనంగా మారింది.
ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ దారుణానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ నెల 24న నలుగురు స్నేహితులు కలిసి మద్యం సేవించారు. అనంతరం నారాయణగూడలోని ఒక హోటల్ కు వెళ్లారు. ఫుల్ గా బిర్యానీ తినేశారు. బిల్లు నువ్వు కట్టాలంటే నువ్వు కట్టాలంటూ వాగ్వాదం జరిగింది. వివాదం ఒక కొలిక్కి వచ్చాక బయటకు వచ్చిన వారు కాసేపటికి వైఎస్సార్ పార్కు వద్దకు చేరుకున్నారు.
అక్కడ మరోసారి గొడవ పడ్డారు. బిర్యానీ బిల్లు కట్టమంటే కట్టలేదంటూ ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలో అభిలాష్ ను వంశీ తోసేయటంతో రాయి మీద పడ్డాడు. తలకు తీవ్ర గాయం కావటంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. ఫుల్ గా తాగేసి.. తిండి కోసం జరిగిన కోట్లాట నిండు ప్రాణాల్ని తీయటం గమనార్హం.