కొవిడ్ -19 ..ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న భయంకరమైన మహమ్మారి. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి, ఆ తరువాత కొద్దికొద్దిగా తన ప్రభావాన్ని విస్తరించుకుంటూ ప్రపంచం మొత్తం వ్యాప్తిచెందుతుంది. ఇప్పటికే 80 దేశాలలో కరోనా తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ కరోనా వైరస్ తో వేల సంఖ్యలో మృతి చెందుతుండగా.. వేలమంది కరోనా వైరస్ భారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ ప్రభావంతో ఇప్పుడు దగ్గినా - తుమ్మినా కూడా అదో పెద్ద నేరంగా చూస్తున్నారు. అసలు ఈ వైరస్ ఎవరికీ ఉందొ - ఎవరికీ లేదో కనిపెట్టడం కూడా కష్టంగా ఉన్న ఈ సమయంలో ..ఎవరిని నమ్మలేని పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం కరోనా వైరస్ తో బాధపడుతోన్న అన్ని దేశాలలో దాదాపుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈనేపథ్యంలోనే లిథుయానియాలో ఒక దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. తాజాగా తన భార్యకు కరోనా వైరస్ సోకిందని అనుమానంతో ఆమె ను బాత్ రూం ఉంచి - ఆ రూమ్ కి లాక్ వేసాడు. ఎంతచెప్పినా ఆ రూమ్ నుండి బయటకి రానివ్వకపోవడంతో ,ఆ శాడిస్టు భర్త నిర్వాకాన్ని పోలీసులకు తెలియజేసింది. దీనిపై వెంటనే రియాక్ట్ అయిన పోలీసులు ..ఆ సంఘటన స్థలానికి వచ్చి , ఆమెని బాత్రూం నుండి బయటకి తీసుకోని వచ్చి - ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే, అక్కడ కరోనా వైరస్ సోకలేదని వైద్యులు నిర్ధించారు.
అయితే , ఆ భర్తకి తన భార్యకి కరోనా సోకిందేమో అన్న అనుమానం ఎందుకొచ్చింది అంటే ..కరోనా ప్రభావం మొదలైన తరువాత ఇటలీ నుంచి వచ్చిన ఓ వ్యక్తితో తన భార్య మాట్లాడిందని అతడు తెలుసుకున్నాడు. అదే సమయంలో కరోనా తన పంజా విసరడం మొదలుపెట్టడంతో అతనిలో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. తన భార్యకు కరోనా వైరస్ సోకిందని డాక్టర్ కు చెప్పాడు. ముందుగా భార్యకు మెడికల్ టెస్టులు నిర్వహించాలని, ఆమె ఎక్కడికి వెళ్లకుండా..తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు. దీనికి తన భార్యని ఎక్కడికి వెళ్లనీయకుండా బాత్రూమ్ లో వేసి లాక్ పెట్టాడు. అయితే, ఈ భర్త చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది.