హైదరాబాద్ లో భారీ వర్షాల తీవ్రతకు నిదర్శనమీ చిత్రం. కొద్దిరోజులుగా రాజధానిలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నగరాన్ని వరద ముంచెత్తుతోంది. రోడ్లపై భారీగా వరద పోటెత్తుతోంది. జనజీవనం స్తంభించిపోయింది.
వచ్చే రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే వరదతో రోడ్లు మునిగి ఓపెన్ నాలాస్ అన్నీ పొంగి పొర్లుతున్నాయి. అయితే తాజాగా హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలోని కృష్ణనగర్ లో వరద పోటెత్తింది. రోడ్డు మధ్యన నడుచుకుంటూ పోతున్న ఓ వ్యక్తి ఈ వరద ధాటికి కొట్టుకుపోతున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది.
ఓ వ్యక్తి బలమైన నీటి ప్రవాహానికి నీటిలో పడి కొట్టుకుపోయినట్లు ఆ వీడియోలో కనిపించింది. పక్కనే కొట్టుకోవడానికి రెడీ అయిన బైక్ ను ఇద్దరు ముగ్గురు కలిసి ఆపుతుండగా.. పక్కనే వరదల్లో ఓ మనిషి చిక్కుకొని కొట్టుకుపోయాడు.
ప్రస్తుతానికి కృష్ణా నగర్ లో వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి ఆచూకీ కనిపించలేదు. అతడు సేఫ్ అయ్యాడా? లేక వరదతోపాటు నాలాలోకి వెళ్లి మరణించాడా అన్న విషయం ధ్రువీకరించలేదు. అయితే కొట్టుకుపోతున్న వీడియో మాత్రం వైరల్ గా మారింది.
వర్షాలతో హైదరాబాద్ లో ఇలాంటి దారుణాలకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది ఈ వరదల ధాటికి అతలాకుతలం అయినా వారి ఆచూకీ మాత్రం చిక్కడం లేదు.
వీడియో కోసం క్లిక్ చేయండి