హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ ను ఊహించని రీతిలో బోల్తా కొట్టించాడో వ్యక్తి. ఇతగాడి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మహారాష్ట్రకు చెందిన ఈవ్యక్తిని గుర్తించి.. అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇంతకూ జరిగిందేమిటంటే..
మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చాడు. తనను తాను కాంట్రాక్టర్ గా.. పొలిటీషియన్ కు బ్రదర్ గా పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి.. సోమాజీగూడలోని ద పార్క్ హోటల్ కు వచ్చారు. మూడు రోజుల పాటు దర్జాగా కాలం గడిపిన సదరు వ్యక్తి.. తీరా బిల్లు చెల్లించే సమయానికి తన దగ్గర డబ్బులు లేవని.. అందుకు బదులుగా తన ఇన్నోవా కారు ఉంచుకోవాలని.. తాను ఊరికి వెళ్లిన వెంటనే డబ్బులు చెల్లిస్తానని చెప్పారు.
మూడు రోజులకు రూ.3.66 లక్షలు ఛార్జ్ చేసిన హోటల్ యాజమాన్యం.. డబ్బుల్ని వసూలు చేసేందుకు పలుమార్లు ఫోన్లు చేశారు. అయినప్పటికీ అతను స్పందించలేదు. రెండు.. మూడు రోజుల అనంతరం అతడి ఫోన్ స్విచ్ఛాప్ చేయటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు హోటల్ సిబ్బంది.
ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం ముంబయికి చెందిన గ్రావిటీ మోటార్ ట్రావెల్స్ ప్రతినిధులు హోటల్ కు వచ్చారు. ఆరు నెలల క్రితం కృష్ణ చైతన్య అనే వ్యక్తి తమ దగ్గర కారు అద్దెకు తీసుకున్నారని.. అప్పటి నుంచి అతను కనిపించటం లేదని.. అతను తమకు రూ.2.5లక్షలు బాకీ ఉన్నట్లుగా చెప్పారు. దీంతో హోటల్ యాజమాన్యం.. తమకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి చెప్పి... రూ.3.66లక్షల బిల్లు చెల్లించి కారు తీసుకెళ్లాలన్నారు. మొత్తంగా ఈ పంచాయితీ ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు చేరింది. ఇలా అందరికి టోకరా ఇస్తున్న కృష్ణ చైతన్యనను అదుపులోకి తీసుకోవటానికి పోలీసులు రంగంలోకి దిగారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/