ఇండియ‌న్ ఐటీ మాఫియా..మా ఉద్యోగాలు దోచేసింది

Update: 2017-03-06 12:30 GMT
అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌న‌దేశ‌స్తుల‌పై వ‌రుస‌గా జ‌రుగుతున్న దాడుల నేప‌థ్యంలో ఓ వ్య‌క్తి పోస్ట్ చేసిన వీడియో ఒక‌టి ఆస‌క్తి రేపుతోంది. ఇమ్మిగ్రేష‌న్‌ ను తీవ్రంగా వ్య‌తిరేకించే సేవ్ అమెరిక‌న్ ఐటీజాబ్స్‌.కామ్ అనే వెబ్‌ సైట్ న‌డిపే వ్య‌క్తి... ఒహాయో రాష్ట్రంలోని కొలంబ‌స్ టౌన్ ఎలా ఇండియ‌న్స్‌ తో నిండిపోయిందో ఆ వీడియోలో చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. అదొక ఇండియ‌న్ పార్క్ అని - మినీ ముంబై అని అత‌ను కామెంట్ చేశాడు. త‌మ సాటి అమెరిక‌న్ల ఉద్యోగాల‌ను దోచుకొని, ఇండియ‌న్స్ ఎంతలా సంపాదిస్తున్నారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంద‌ని ఆ వ్య‌క్తి చెప్పాడు. ఈ వీడియోకు ఇప్ప‌టికే ల‌క్ష‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. ఇండియ‌న్ ఐటీ మాఫియా అని కూడా ఆ వెబ్‌ సైట్ తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది.

వ‌ర్జీనియా నుంచి స్టీవ్ పుష‌ర్ అనే వ్య‌క్తి ఈ వెబ్‌ సైట్‌ ను న‌డిపిస్తున్న‌ట్లు బ‌జ్‌ ఫీడ్ రిపోర్ట్ వెల్ల‌డించింది. అమెరికాలో విదేశీయులు ఎంత‌లా పెరిగిపోతున్నారో అర్థం చేసుకోవ‌చ్చ‌ని పుష‌ర్ చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. గ‌తంలోనే ఈ వీడియోతోపాటు ఒహాయో.. ఎ జ‌ర్నీ టు ఇండియ‌న్ పార్క్ అనే ఓ డాక్యుమెంట్‌ ను కూడా త‌న వెబ్‌ సైట్‌ లో ఉంచాడు పుష‌ర్‌. అయితే తాజాగా ట్రంప్ విధానాలు, ఇండియ‌న్స్‌ పై జ‌రుగుతున్న విద్వేష దాడుల నేప‌థ్యంలో ఈ వీడియో మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. అమెరిక‌న్ల ఉద్యోగాల‌ను విదేశీయులు ఎంత‌లా దోచుకుంటున్నారో చెప్పే ప్ర‌య‌త్న‌మే ఇద‌ని, అంతమాత్రాన వీళ్లంద‌రినీ దేశం వ‌దిలి వెళ్లాల‌నికానీ.. వారిపై హింస‌కు పాల్ప‌డాల‌న్న ఉద్దేశం త‌న‌కు లేద‌ని పుష‌ర్ స్ప‌ష్టంచేశాడు.

అయితే ఈ వీడియోపై ఇండియ‌న్స్ మండిప‌డుతున్నారు. త‌మ‌కు అవ‌కాశాలు క‌ల్పించ‌డ ద్వారానే అమెరికాకు వ‌చ్చామ‌ని, అది కూడా నిబంధ‌న‌ల ప్ర‌కారం జ‌రిగింద‌ని చెప్పుకొచ్చారు. ఇప్ప‌టికే అమెరికాలో ఉద్రిక్త ప‌రిస్థితులు ఉన్న స‌మ‌యంలో ఇలాంటి ప్ర‌చారం చేయ‌డం మ‌రింత‌గా రెచ్చ‌గొట్టిన‌ట్లు అవుతుంద‌ని పేర్కొంటున్నారు. ఇలాంటి అంశాల‌పై సంయమ‌నం పాటించాల‌ని వారు సూచించారు.

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News