కేంద్ర మంత్రిపై గాజులు విసిరారు

Update: 2017-06-13 07:53 GMT
ఓప‌క్క అంత‌కంత‌కూ ఇమేజ్ పెంచుకుంటున్న ప్ర‌ధాని మోడీ ఇమేజ్‌కు భిన్నంగా ఆయ‌న ప్ర‌భుత్వంపై ప‌లువురు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మోడీ పాల‌న‌పై కొంద‌రు అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ నిరస‌న వ్య‌క్తం చేస్తున్నారు. మోడీ స‌ర్కారుపై త‌మ‌కున్న నిర‌స‌న‌ను ప‌లువురు కేంద్ర‌మంత్రుల ఎదుట ప్ర‌ద‌ర్శిస్తున్నారు. మొన్న‌టికి మొన్న కేంద్ర వ్యవసాయ మంత్రికి నిర‌స‌న‌ల‌తో చేదు అనుభ‌వాన్ని మిగ‌ల్చ‌గా.. తాజాగా అవ‌మాన‌క‌ర‌మైన ఘ‌ట‌న కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీకి ఎదురైంది.
 
గుజ‌రాత్ లోని అమ్రేలీలో ఒక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. మూడేళ్ల మోడీ పాల‌న ముగిసిన నేప‌థ్యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ ప్ర‌సంగిస్తున్నారు. మూడేళ్ల పాల‌న‌లో ప్ర‌భుత్వ ప‌ని తీరు గురించి స్మృతి మాట్లాడుతున్న వేళ‌.. ఒక వ్య‌క్తి అనూహ్యంగా ఆమెపై గాజులు విసిరారు.

అయితే.. అవేమీ ఆమెకు త‌గ‌ల్లేదు. స్మృతిపై గాజులు విసిరిన వ్య‌క్తి.. వందేమాత‌రం అంటూ నినాదాలు చేశారు. అనంత‌రం అత‌డ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతుల‌కు రుణ‌మాఫీ.. వారి అప్పుల గురించి మాట్లాడే స‌మ‌యంలోనే స‌ద‌రు వ్య‌క్తి మంత్రి స్మృతి ఇరానీపై గాజులు విసిరారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా సంచ‌ల‌నంగా మారింది. మోడీ సొంత రాష్ట్రంలో ఆయ‌న పాల‌న‌కు వ్య‌తిరేకంగా ఇంత తీవ్ర‌స్థాయిలో నిర‌స‌న వ్య‌క్తం కావ‌టం ఆశ్చ‌ర్యంగా మారింద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News