కలలో కూడా ఊహించలేనంత దారుణంగా తాజాగా ఏపీలోని నిడమర్రులో చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచలనంగా మారటమే కాదు.. ఈ ఉదంతాన్ని విన్నంతనే భయంతో గగుర్పాటుకు గురయ్యే పరిస్థితి. ఊహకు కూడా అందని రీతిలో ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే..
ప్రైవేటు స్కూల్లో టీచర్ గా పని చేసే ఒక మహిళ అర్థరాత్రి వేళ బాత్రూం కోసం ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఇంటికి ప్రహరీ లేకపోవటంతో గోడ దూకి వచ్చాడు గ్రామానికి చెందిన కడగళ్ల రాజేశ్. 20 ఏళ్ల అతడు.. ఆమె నోరు మూసేసి.. బలవంతంగా ఎత్తుకెళ్లాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించటంతో ఆమెపై దాడి చేశాడు. అత్యాచార యత్నం చేసే ప్రయత్నం చేశాడు. ఆమె ససేమిరా అంటూ పోరాడింది. దీంతో పట్టలేని ఆగ్రహంతో ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె స్పృహ తప్పింది. చనిపోయిందని భావించిన అతడు.. సమీపంలో దుక్కి దున్నిన పొలంలో ఆమెను పడేశాడు.
అప్పటికే వర్షం పడుతుండటంతో.. హడావుడిగా బురదమట్టితో కప్పేసి పారిపోయాడు. అయితే.. కాసేపటికి స్పృహలోకి వచ్చిన సదరు మహిళ.. తన పరిస్థితిని అర్థం చేసుకొని.. తన మీద కప్పిన బురద మట్టిని తొలగించి బయటపడింది. తీవ్రమైన గాయాలు.. ఓపిక లేనప్పటికీ.. శక్తిని కూడదీసుకొని ఇంటికి వెళ్లింది. ఇంట్లో వారంతా షాక్ తిన్నారు జరిగిందంతా తెలుసుకొని. కడపులోకి మట్టి వెళ్లటంతో అస్వస్థతకు గురైంది. రెండు గంటల పాటు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించిన ఆమె.. ఆ షాక్ లో నుంచి బయటకు రాలేకపోతున్నారు.
స్నానం చేయించి.. ఆమెను ఆసుపత్రికి తరలించారు. కోలుకున్నాక.. తమకు జరిగిన దారుణం మరొకరికి ఎదురుకాకూడదన్న ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. అతని తల్లిదండ్రుల్ని పోలీసులు స్టేషన్ కు తీసుకొచ్చారు. దీంతో.. అతగాడు పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడు గతంలోనూ ఒక అమ్మాయిని ప్రేమించాలని వేధించాడని.. పెద్దల రాజీతో బయటపడ్డాడని.. అప్పుడే పోలీసులు తగిన రీతిలో శిక్షిస్తే.. ఇప్పుడీ దారుణం జరిగేది కాదన్న బాధితులు.. అతడ్ని శిక్షించాలని కోరారు.