డిస్కవరీ ఛానెల్ క్రమం తప్పకుండా చూసేవాళ్లకు మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్రిటన్ కు చెందిన ప్రజెంటర్ బేర్ గ్రిల్స్ ఒంటరిగా దట్టమైన అడవులు- ఎడారులు- నదుల్లో తిరుగుతూ మనం ఎప్పుడూ చూడని సరికొత్త ప్రపంచాన్ని మన కళ్లమందు కదలాడేలా చేస్తాడు. ఈ అద్భుతమైన కార్యక్రమానికి డిస్కవరీ ఛానెళ్లో అదిరిపోయే రేటింగ్స్ వస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి తిరుగులేని క్రేజ్ ఉంది.
ఈ క్రేజీ ఎపిసోడ్ కు ఇప్పుడు అదిరిపోయే క్రేజ్ రానుంది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ ఎపిసోడ్ లో కనిపించనున్నారు. అరణ్యాల్లో ప్రవేశించి అక్కడి జంతుజాలాలు- సరీసృపాల మనుగడను ప్రత్యక్షంగా వివరించే ఈ షోలో ప్రధాని నరేంద్ర మోదీ కనువిందు చేయనున్నారు. ఈ షోకు హోస్ట్ గా ఉన్న సాహసవీరుడు బేర్ గ్రిల్స్ తో కలిసి ప్రధాని మోదీ అడవుల్లో పర్యటించిన వీడియో ప్రోమోను డిస్కవరీ ఛానెల్ అధికారికంగా విడుదల చేసింది. అంతే కాకుండా ఆగస్టు 12వ తేదీ రాత్రి 9 గంటలకు ఇండియన్ డిస్కవరీ ఛానెళ్లో ప్రసారం చేస్తున్నట్టు కూడా ప్రకటించింది.
ఈ ఎపిసోడ్ ను ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ పార్కులో చిత్రీకరించనున్నారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ కోసమే గ్రిల్స్ మనదేశానికి వచ్చి జిమ్ కార్బెట్ జాతీయ పార్కులోని ధికలా ఫారెస్ట్ లాడ్జిలో మకాం వేశారు. ఈ యేడాది ఫిబ్రవరిలోనే ఈ ఎపిసోడ్ షూట్ చేసినట్టు సమాచారం. ఈ ఎపిసోడ్ షూట్ చేస్తోన్న టైంలోనే జమ్మూలో పుల్వామా దాడిలో 40 మంది జవాన్లు మృతిచెందారు. అప్పట్లోనే జవాన్లు దాడిలో చనిపోతే మోడీకి జిమ్ కార్బెట్ పార్కులో ఏం పని అన్న విమర్శలు కూడా విపక్షాల నుంచి వచ్చాయి. అందుకే ఈ విషయాన్ని అప్పట్లో సైలెంట్ చేసేశారు.
ఈ ఎపిసోడ్ ప్రసారాన్ని పురస్కరించుకుని గ్రిల్స్ తన ట్వీట్టర్ లో ఓ వీడియోను కూడా పోస్ట్ చేశాడు. మీరు సరికొత్త మోడీని చూడబోతున్నారంటూ కూడా క్యాప్షన్ పెట్టారు. ఈ ఎపిసోడ్ ప్రపంచవ్యాప్తంగా మొత్తం 180 దేశాల్లో ప్రసారం కానుంది. గ్రిల్స్ గతంలోనూ అమెరికా అధ్యక్షుడు ఒబామాతో ఈ తరహా ఎపిసోడ్ చిత్రీకరించారు. ఏదేమైనా భారతదేశం అంతా మోడీ ఎపిసోడ్ ప్రారంభమయ్యే ఆగస్టు 12వ తేదీ కోసం వెయిట్ చేస్తోంది.
Full View