అమెరికాలో మరొకడ్ని పట్టుకున్నారు

Update: 2016-06-13 09:44 GMT
నరమేధం జరిగినఓర్లాండో నైట్ క్లబ్ ఉదంతం అమెరికా వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా షాకింగ్ గా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా భారీ ముప్పు తప్పినట్లుగా అమెరికా పోలీసులు చెబుతున్నారు. ఓర్లాండో ఇష్యూ నేపథ్యంలో భద్రతను మరింత పెంచిన పోలీసులు.. అనుమానితులపై డేగ కన్ను వేశారు. ప్రతి ఒక్కరిని నిశితంగా పరిశీలిస్తున్న అధికారులు తాజాగా 20 ఏళ్ల యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

అతడ్ని తనిఖీ చేయగా.. మూడు తుపాకులు.. పెద్దఎత్తున పేలుడు పదార్థాలు లభించటం పోలీసులకు షాకింగ్ గా మారింది. వెస్ట్ హాలాండ్ లో జరుగుతున్న గే పరేడ్ లో పాల్గొనేందుకు వెళుతున్నట్లుగా చెబుతున్న అతని దగ్గర మూడు తుపాకులు.. పేలుడు పదార్థాలు ఎందుకు ఉన్నాయన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు. జేఫర్సన్ విల్లేకు చెందిన జేమ్స్ గా అతన్ని గర్తించారు. ఎయిర్ ఫిల్టర్ కంపెనీలో ఆడిటర్ గా ఉద్యోగం చేస్తున్న అతడి వ్యవహారంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతడికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం పోలీసులు తీవ్రంగా పరిశోధిస్తున్నారు. 
Tags:    

Similar News