ప్రపంచ బాడ్మింటన్ లో స్వర్ణం సాధించిన మన పీవీ సింధుకు అటు ప్రధాని నుంచి ఇటు సెలెబ్రెటీలు ప్రజల దాకా అందరి నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్ అయిన సింధూ బ్రాండ్ వాల్యూ కూడా అమాంతం పెరిగిపోయింది. నాలుగు దశాబ్ధాల కలను నెరవేర్చిన ఆమెను అందరూ కొనియాడకుండా ఉండడం లేదు..
అయితే సింధూనే కాదు.. మరో మన అమ్మాయి కూడా స్వర్ణం సాధించింది. అయితే ఆమె వికలాంగురాలు.. పాల్గొంది పారా బ్యాడ్మింటన్ లో.. వికలాంగులైన వారికి నిర్వహించే ఈ పారా బ్యాడ్మింటన్ లో మన భారత క్రీడాకారిణి మానసి జోషి ఏకంగా ప్రపంచ నంబర్ 1 పారుల్ పామర్ ను ఓడించి తొలిసారి పారా వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ టైటిల్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈమెను విష్ చేస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్వీట్ చేయడంతో ఈమె కూడా స్వర్ణం గెలిచిందని.. ఈమె ప్రతిభ చాటిందని తెలిసింది.. అసలు ఈమె ఎవరనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
2011లో జరిగిన ముంబైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మానసి తీవ్రంగా గాయపడింది. ఆమె ఎడమకాలు నుజ్జునుజ్జు అయ్యింది. ఎముకలు విరిగాయి. సకాలంలో ఈమెకు వైద్య సాయం అందలేదు. ప్రమాదం జరిగిన మూడు గంటలకు ఆస్పత్రికి తీసుకెళ్లారు. 10 గంటల తర్వాత వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. అప్పటికే ఎడమకాలుకు గ్యాంగ్రీన్ సోకడంతో ఆమె కాలును వైద్యులు తీసేశారు. అయితే ఇంతటి విషాదం నుంచి తేరుకొని కృతిమ కాలుతో నడవడం.. ఆ తర్వాత బ్యాడ్మింటన్ పై ఆసక్తితో ఆడడం మొదలు పెట్టింది మానసి..
2014లో అంతర్జాతీయ క్రీడల్లో ప్రవేశించింది. కెనడియన్ ఓపెన్ లో ఫైనల్ లో ఓడిపోయింది. ఆ తర్వాత తాజాగా రెండు నెలల క్రితం హైదరాబాద్ గోపిచంద్ అకాడమీలో చేరి సాధన చేసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ను సాధించింది. సింధూతోపాటు ఈమె కూడా ప్రపంచ చాంపియన్ గా నిలిచినా ఈమె క్రీడాంశంతోపాటు ఈమె గురించి చాలా మందికి తెలియకపోవడం గమనార్హం..