వైరస్ కారణంతో మన దేశానికి చెందిన ఎంతో మంది ప్రజలు వివిధ దేశాల్లో చిక్కుకుపోయారు. వారిని రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇదే తరుణంలో సింగపూర్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు సింగపూర్ తెలుగు సమాజం ప్రత్యేక చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు నటుడు మోహన్ బాబు తెలిపారు.
వచ్చే వారం ఈ విమానం సింగపూర్ నుంచి హైదరాబాద్ కు రానున్నట్టు ఆయన పేర్కొన్నారు. సింగపూర్‌లో చిక్కుకుని హైదరాబాద్ రావాలనుకుంటున్న వారిని వివరాలివ్వమంటూ ఆయన ట్వీట్ పెట్టారు. ఈ విమానంలో రావాలనుకుంటున్న వారు తమ పూర్తి పేరు, నెంబర్‌ను singhydplane@gmail.comకు పంపాల్సిందిగా మోహన్ బాబు కోరారు.
అయితే , వందే భారత్ మిషన్ లో విదేశాల నుంచి వస్తున్న వారు తమ ప్రయాణ ఖర్చులను తామే భరించాల్సి ఉంటుంది. అయితే, మోహన్ బాబు ప్రస్తావించిన విమానం లో ఉచిత సర్వీసు ఏమైనా పెట్టారా ? లేక ఇది కూడా పెయిడ్ సర్వీసెనా అనే విషయాలు తెలియాల్సి ఉంది.