తనకు రాజకీయాలు నప్పవు నప్పువు అంటూనే.. అప్పుడప్పుడు ఆ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటాడు మంచు మోహన్ బాబు. గతంలో ఆయన తెలుగుదేశం.. భారతీయ జనతా పార్టీల్లో పని చేయడం రాజ్యసభ సభ్యత్వం కూడా పొందడం గుర్తుండే ఉంటుంది. ఐతే దాదాపు దశాబ్దంన్నరగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ఆయనకు రాజకీయాలపైకి మనసు మళ్లుతున్నట్లుంది. తాజా పరిణామాల్ని బట్టి ఆయన త్వరలోనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐతే ఈసారి మోహన్ బాబు సింగిల్ గా రావట్లేదట. తన కూతురు మంచు లక్ష్మిని కూడా తన వెంట తెస్తున్నారట.
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో మంచు లక్ష్మి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీలో గత కొంత కాలంగా బలమైన మహిళా నేతలకు కొరత ఏర్పడింది. అటువైపు వైఎస్సార్ కాంగ్రెస్ లో రోజా గళం గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నుంచే ఆమెకు మంచు లక్ష్మి గట్టి పోటీ దారు అవుతుందని.. తన వాయిస్ వినిపిస్తుందని భావిస్తున్నాయి తెలుగుదేశం వర్గాలు. చంద్రగిరి నియోజకవర్గంలో మంచు ఫ్యామిలీకి బాగానే ఫాలోయింగ్ ఉంది. వాళ్ల ‘విద్యా నికేతన్’ ఉన్నది ఆ నియోజకవర్గంలోనే. చుట్టు పక్కల గ్రామాల్లో మంచు ఫ్యామిలీ అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మిని ఇక్కడ బరిలోకి దించితే సులభంగా గెలుస్తుందని భావిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/