ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన కురుక్షేత్ర సభను ఏపీ సర్కారు అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన నేపథ్యంలో మందకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. తమ సహకారంతో టీడీపీ తెలంగాణలో పాదయాత్ర పూర్తి చేసుకోవడంతో పాటు, ఏపీలో అధికారం చేపట్టిందని మందకృష్ణ గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగగా ఉంటామని చెబితే పైసాకు ఆశించకుండా నమ్మామని అయితే తమ సహకారంతో గెలిచిన చంద్రబాబు మూడేళ్లుగా వర్గీకరణను మూలన పెట్టారని మండిపడ్డారు. వర్గీకరణను వ్యతిరేకిస్తున్న శక్తులకు ఉన్నత పదవులు ఇస్తున్నారని తమ జాతిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆవేదన చెప్పుకొనేందుకు సభ పెట్టుకోవాలనుకుంటే అడ్డుకుంటున్నారని విమర్శించారు.
1994 నుంచి లక్షల మందితో సభలు పెట్టుకున్న సందర్భాల్లో ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిన దాఖలాలు లేవని మందకృష్ణ గుర్తు చేశారు. ``మాల మహానాడు - మాదిగ దండోరా ఒకేసారి నిర్వహించిన ఘటనలు ఎప్పుడూ లేవు. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా పోలీసులతో అనుమతిని రద్దు చేయించారు. హైకోర్టు మా గత చరిత్ర పరిశీలించి అనుమతివ్వాలని ఆదేశించింది. అయినప్పటికీ అనుమతి రద్దు చేయడంతో పాటు అన్ని జిల్లాలు, రాష్ట్ర సరిహద్దులో వేలాది పోలీసులను మోహరించి అరెస్టులు, లాఠీ చార్జీలు చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటే నిర్బంధం చేస్తున్నారు. మేము అనుమతి కోరిన చోటే గతంలో చంద్రబాబు యువగర్జన, ప్రమాణ స్వీకారం కార్యక్రమాలు నిర్వహించారు. అదే ప్రాంతంలో చట్టాన్ని, న్యాయాన్ని పాతరేస్తున్నారు``` అని మందకృష్ణ మండిపడ్డారు. అదే ప్రదేశంలో గతంలో మాలమహానాడు - పవన్ కల్యాణ్ చేనేత సమావేశం పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఆవేదనను చూపే అవకాశం కల్పించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల్లో ఆవేశం కట్టలు తెచ్చుకుంటుందని స్పష్టం చేశారు.
అరెస్టులకు భయపడబోమని మందకృష్ణ ప్రకటించారు. మాదిగలంతా రోడ్డుపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలనుకుంటున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని కోరారు. కేంద్ర మంత్రి వెంకయ్య సైతం మాదిగల క్రమశిక్షణకు జేజేలు పలికారని గుర్తు చేశారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం శాంతియుతంగా నిర్వహించాలనుకుంటున్నామన్నారు. మాదిగ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పిలిచి చంద్రబాబు బెదిరించారని ఆరోపించారు. కురుక్షేత్రానికి వెళ్లొద్దని, వర్గీకరణ గురించి మాట్లాడొద్దని, మాలలతో కలిసి పనిచేయాలని హెచ్చరించారని మందకృష్ణ తెలిపారు. 4వ తేదీ రాత్రి 7.30 నుంచి 9.30 మధ్యలో మాదిగ ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - నేతలను చంద్రబాబు బెదిరించారని మందకృష్ణ తెలిపారు. వర్గీకరణ చేయబోనని, మాదిగలెక్కడున్నారని ప్రశ్నించినట్లు తెలిసిందని ఆయన తెలిపారు. మాదిగలే లేనప్పుడు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు నిర్బంధం ఎందుకు పెట్టారని నిలదీశారు.
చంద్రబాబును ఓడించేందుకు ప్రయత్నించిన జూపూడి ప్రభాకర్ - కారెం శివాజీలకు కార్పొరేషన్ పదవులిచ్చారని మందకృష్ణ ఆరోపించారు. మాదిగ వర్గానికి చెందిన రావెల కిశోర్ బాబును తొలగించి ఆ శాఖను మాలకు చెందిన నక్కా ఆనందబాబుకు ఇచ్చారని తెలిపారు. ఎస్సీలకు సంబంధించి ఉన్న మూడు శాఖలను మాలలకే ఇచ్చారని తెలిపారు. ఓడించేందుకు తిరిగిన వారికి పదవులు, గెలిచేందుకు సహకరించిన వారికి సంకెళ్లు వేశారని ఆరోపించారు. ఎక్కడ అరెస్టులు చేశారో అక్కడ ఎదురు తిరిగి రోడ్లను దిగ్బంధనం చేస్తామని ప్రకటించారు. వర్ల రామయ్య - జవహర్ ఏనాడూ మాదిగ ఉద్యమంలో పాల్గొనలేదని మందకృష్ణ తెలిపార. మంత్రి పదవి కోసం జవహర్ - రాజ్యసభ సీటిస్తానన్నారని వర్ల మాదిగలకు ద్రోహం చేస్తున్నారని మందకృష్ణ మాదిగ ఆరోపించారు.