ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఇరకాటంలో పడేయటం లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ ఆసక్తికరమైన ఫార్ములాను ప్రతిపాదించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం పట్టుపడుతున్న కాపులు - మాదిగలు కలిసి ఉద్యమిస్తే సీఎం చంద్రబాబుకు చమటలు పట్టడం ఖాయమని మంద కృష్ణమాదిగ అన్నారు. గుంటూరులో జరిగిన మాదిగ న్యాయవాదుల జాతీయ సదస్సులో మందకృష్ణ మాట్లాడారు. ఎస్ సీ వర్గీకరణ కేంద్రం బాధ్యత అని చంద్రబాబు పక్కకు తప్పుకుంటే కుదరదని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు వర్గీకరణ చేసి తీరాల్సిందేనని మందకృష్ణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎన్నో అంశాలపై నిత్యం కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్న సీఎం వర్గీకరణపై కేంద్రంతో మాట మాత్రమైనా సంప్రదించకుండా తప్పించుకోవాలని చూడటం మాదిగ జాతికి ద్రోహం చేసినట్లేనని మందకృష్ణ మండిపడ్డారు. కాపులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే కేంద్ర ఆమోదం తప్పనిసరవుతుందని, అప్పుడూ ఇలాగే వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు. 23 ఏళ్ల ఉద్యమంలో తమపై ఎప్పుడూ పోలీసుల అణచివేత లేదని - గతేడాది నుంచి ఎన్నో అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్గీకరణ హామీ ఇచ్చినప్పటికీ ఆచరణ రూపంలో క్రియాశీలంగా ముందుకు సాగడం లేదని - దీనిని ప్రశ్నించినందుకు తనను లక్ష్యంగా చేసుకున్నారని మందకృష్ణ మండిపడ్డారు.
కాగా, ఈ ఏడాది జూలైలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన కురుక్షేత్ర సభను ఏపీ సర్కారు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. తమ సహకారంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో పాదయాత్ర పూర్తి చేసుకోవడంతో పాటు - ఏపీలో అధికారం చేపట్టిందని మందకృష్ణ గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగగా ఉంటామని చెబితే పైసాకు ఆశించకుండా చంద్రబాబును నమ్మామని అయితే తమ సహకారంతో గెలిచిన చంద్రబాబు మూడేళ్లుగా వర్గీకరణను మూలన పెట్టారని మండిపడ్డారు. వర్గీకరణను వ్యతిరేకిస్తున్న శక్తులకు ఉన్నత పదవులు ఇస్తున్నారని తమ జాతిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆవేదన చెప్పుకొనేందుకు సభ పెట్టుకోవాలనుకుంటే అడ్డుకుంటున్నారని విమర్శించారు.