ఉద్యమనాయకులు రాజకీయ శక్తులుగా మారిన తర్వాత వారి ఉద్యమ పట్టును తిరిగి కొనసాగించడం కత్తిమీద సాము వంటిదే. అటు అనుచరులు చీలిపోవడం, ఇటు రాజకీయాలు కష్టంగా ఉండటం వంటివి వారిని తీవ్రంగా ఇబ్బంది పెడ్తాయి. దళితుల వర్గీకరణ పేరుతో పెద్ద ఉద్యమాన్ని లేవనెత్తి, విజయం సాదించిన మందకృష్ణకు తాజాగా అదే పరిస్థితి ఎదురవుతోంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని కాకుండా రెండు రాష్ట్రాల్లోనూ ఆయనకు ఇబ్బంది ఎదురవుతోంది. రెండు చోట్లా పోరాటం చేయక తప్పనిసరి పరిస్థితిని మందకృష్ణ ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుగానే ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించింది. దీంతో మందకృష్ణకు ఇక్కడ ఏ డిమాండ్ తో పోరాడాలో తెలియని పరిస్థితి. దీంతో పాటు కేసీఆర్ మరో ఎత్తు వేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ ఎమ్మార్పీఎస్ పేరుతో తన అనుచరులతో మరో సంఘాన్ని ఏర్పాటుచేసి దళితులకు న్యాయం చేసింది కేసీఆర్ అని గ్రామగ్రామాన ప్రచారం చేయిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో మందకృష్ణను వాడుకొని ప్రస్తుతం కరివేపాకులాగా పక్కనపెట్టేశారు. కనీసం వర్గీకరణ విషయమై మాట్లాడేందుకు రావాలని సైతం బాబు మందకృష్ణను ఆహ్వానించకపోవడం గమనారÛం. దీంతో దిక్కతోచని స్థితిలో మందకృష్ణ ఏపీలో కూడా వర్గీకరణ చేయాలని చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో పోలీసులు భంగం చేశారు.
తెలంగాణ సర్కారుకు, ఏపీ సర్కారుకు మందకృష్ణ వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారనేది ఇపుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఏ ప్రభుత్వమూ ఆయన్ను దగ్గరగా తీసుకోకపోవడం వల్ల ఆయన తన ఉనికిని చాటుకునేందుకు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే రీతిగా సతమతమయిన ఆర్.కృష్ణయ్య, కారెం శివాజీలను మందకృష్ణ ఉదాహరణగా తీసుకోవచ్చు. అయితే పోరాటం లేదా సంఘీభావం అనే మార్గాన్ని ఎంచుకోవచ్చు. మందకృష్ణ ఎందుకు ఆ విధంగా చేయలేకపోవతున్నారో సమీక్షించుకోవాలి.