పోయిన చోట వెతికితే దొరికే అవకాశం ఉందంటారు. కానీ.. ఇలాంటివి రాజకీయాల్లో సాధ్యం కాదు. దెబ్బ తిన్న అంశం మీదన మాట్లాడటం ద్వారా అనవసర తలనొప్పులు తప్పించి ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఉండదన్న విషయాన్ని తలపండిన రాజకీయనేతలు ఎందుకు మిస్ అవుతారో ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి.
తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ ఉదంతంలో ఇది నిజమనిపించక మానదు. ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయనపై అప్పట్లో విమర్శలు భారీగా వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన ఆయన తనకు హిందీ సరిగా రాదని కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా.. కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ఏడాది పాటు సస్పెండ్ చేసింది మర్చిపోకూడదు.
తాజాగా మోడీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్రలో మోడీలా దుర్బాషలాడిన ప్రధాని మరొకరు లేరని.. భవిష్యత్తులో మోడీ తీరు ఇలా ఉంటుందన్న అంచనాను తాను వేసినట్లు చెప్పారు. ఈ కారణంతోనే తాను 2017 డిసెంబరు 7న వ్యాఖ్యలు చేశానని చెప్పారు.
మోడీ ఒక నీచమైన మనిషి. ఆయన చేసే రాజకీయాలు నీచమైనవి. అసలు ఏ మాత్రం సభ్యత లేని మనిషి.. అంటూ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మణిశంకర్ అయ్యర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు రాహుల్ గాంధీ. అంతే కాదు.. ఇలాంటి తిట్లు తిట్టటం కాంగ్రెస్ కల్చర్ కాదని.. సారీ చెప్పాలని ఆదేశించారు. దీంతో.. తప్పని పరిస్థితుల్లో అయ్యరో సారీ చెప్పారు. తనకు హిందీ సరిగా రాదన్న కవరింగ్ మాటలతో క్షమాపణల కార్యక్రమాన్ని మమ అనిపించారు.
తాజాగా మాటలతో విరుచుకుపడ్డ అయ్యర్.. మోడీ తీరును తాను రెండేళ్ల క్రితం చెప్పినట్లే ఆయనిప్పుడు అలాంటి ధోరణినే ప్రదర్శిస్తున్నారని చెప్పారు. అయ్యర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ రియాక్ట్ అవుతూ.. ఆయన చేసిన వ్యాఖ్యలన్ని ఆయన వ్యక్తిగతమైనవే తప్పించి.. పార్టీకి సంబంధం లేదని తేల్చారు.
రైజింగ్ కశ్మీర్ కు రాసిన ఒక వ్యాసంలో మణిశంకర్ అయ్యర్ తీవ్రమైన భాషతో మోడీని తిట్టిపోశారు. సదరు వ్యాసంలో ఆయనేం రాశారంటే.. నెహ్రూ కేంబ్రిడ్జిలో సైన్స్ చదువుకున్నారు.. దేశంలో ప్రతి ఒక్కరూ శాస్త్రీయంగా ఆలోచించేలా చేయాలని తపించారు. కానీ.. మోడీకి డిగ్రీలేవీ లేవు. ఉన్నట్లుగా చెప్పుకునేవన్ని అబద్ధాలే. ఢిల్లీ.. గుజరాత్ వర్సిటీల నుంచి ఆయన పట్టాలు పుచ్చుకున్నారన్నది అబద్ధమన్నారు. మోడీ హిందుత్వ సిద్ధాంతాల్ని పుణికి పుచ్చుకున్నారని.. ఆయనో బుర్రలేని ప్రధాని అంటూ కటువైన వ్యాఖ్యల్ని చేశారు.