పార్టీ ఆవిర్భావ సిద్ధాంతాలకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం, దానికి ప్రతిపక్షాల ఐక్యత అనే కలరింగ్ ఇస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై విపక్షాలు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. ప్రధానంగా బీజేపీ రథసారథి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు సైతం ఒకింత ఘాటుగానే రియాక్టవుతున్నారు. బీజేపీ సీనియర్ నేత - మాజీ మంత్రి మాణిక్యాల రావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను తుంగలో తొక్కుతూ కాంగ్రెస్ తో అంటకాగుతున్న చంద్రబాబును తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరించాలని అన్నారు.చంద్రబాబు అవకాశ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీతో కలవడం పరాకాష్ట అని ఆయన వ్యాఖ్యానించారు. దేశం భ్రష్టుపట్టుకుని పోవడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీని పారద్రోలాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబు చేస్తున్న కామెంట్లతో ఆయన మానసిక స్థితిపై అనుమానం కలుగుతోందని మాణిక్యాలరావు వ్యాఖ్యానించారు. `దేశంలో అభివృద్ధి పథంలో ఉన్న వ్యక్తులందరూ నా సలహాతోనే పైకొచ్చారు..నేనే వారందరికీ మార్గదర్శినని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యస్పదంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మానసిక స్థితిపై నాకు అనుమానంగా ఉందని, ఆయన ఎక్కడైనా చూపించుకుంటే మంచిది` అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు గురించి టీడీపీ శ్రేణుల్లో కూడా ఆందోళన నెలకొందని మాణిక్యాల రావు అన్నారు. చంద్రబాబు ఉన్న ఆ పార్టీ నుంచి కార్యకర్తలు, నేతలు బయటకొచ్చి పార్టీని పునర్మించండని పిలుపునిచ్చారు. ప్రధాన ప్రతిపక్షాలతో మాట్లాడినట్లు - ప్రజలకోసమే తాను అన్ని కష్టాలు పడుతున్నట్లు చెప్తున్న చంద్రబాబు కేవలం తన రాజకీయ అవసరాల కోణంలోనే కాంగ్రెస్ తో జట్టుకట్టనట్లు ప్రజలు గుర్తిస్తున్నారని వెల్లడించారు.