జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని.. తొందరపడి ఎవరూ వ్యాఖ్యలు చేయొద్దంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నా.. ఏపీ మంత్రులు మాత్రం పవన్ పై మాటల దాడి ఆపటం లేదు. సోమవారం కర్నూలు జిల్లా మంత్రాలయంలో మాట్లాడిన మాణిక్యాలరావు పవన్ మీద విరుచుకుపడ్డారు.
తన రాజకీయ స్వార్థం కోసమే పవన్ కల్యాణ్ రాజధాని భూముల విషయంలో రైతుల్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ దాదాపు పూర్తి అవుతున్న సమయంలో పవన్ మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. కేవలం మూడు వేల ఎకరాలకు సంబంధించిన రైతులను రెచ్చగొట్టే ప్రయత్నంలో జనసేన ఉందని వ్యాఖ్యానించారు. ఓ పక్క పవన్ కల్యాణ్ ఆందోళనలు.. నిరసనలతో కాకుండా.. చర్చల ద్వారా రాజధాని భూములకు సంబంధించిన సమస్యకు పరిష్కారం వెతకాలన్న పవన్ వైఖరికి భిన్నంగా.. మంత్రి మాణిక్యాలరావు విరుచుకుపడటం గమనార్హం. మరి..ఈ మాటల మంటలు మరెన్ని పరిణామాలకు కారణమవుతాయో..?