శివాజీపై డీజీపీకి ఫిర్యాదు!

Update: 2018-03-24 10:52 GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల అమ‌లుపై కేంద్రం వైఖ‌రిని సినీ హీరో శివాజీ 2014 నుంచి నిర‌సిస్తూనే ఉన్నారు. బీజేపీ కార్య‌క‌ర్త‌గా ఉన్న శివాజీ....ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రం వైఖ‌రికి నిర‌స‌న‌గా ఆ పార్టీకి రాజీనామా కూడా చేశారు. తాజాగా, ఆప‌రేష‌న్ ద్ర‌విడ‌, గ‌రుడ పేర్ల‌తో బీజేపీ ద‌క్షిణాది రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాల‌ని చూస్తోంద‌ని శివాజీ చేసిన కామెంట్స్ దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. అయితే, సినిమా త‌ర‌హాలో రాజ‌కీయా పార్టీలు  నిజ‌జీవితంలో ఆప‌రేష‌న్ లు చేయించ‌వ‌ని, అవ‌న్నీ క‌ట్టుక‌థ‌ల‌ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. ఎవ‌రో చెప్పిన విష‌యాన్ని శివాజీ న‌మ్మి ఈ ర‌క‌మైన‌ర వ్యాఖ్య‌లు చేశార‌ని, వాస్త‌వానికి అటువంటి ఆప‌రేష‌న్ లు చేయడం సాధ్యం కాద‌ని ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ కూడా అభిప్రాయ‌ప‌డ్డారు.

తాజాగా, శివాజీ ఆరోప‌ణ‌ల‌ను బీజేపీ నేత, ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు ఆక్షేపించారు. శివాజీ చేసిన వ్యాఖ్య‌లు అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. `ఆపరేషన్‌ ద్రవిడ`పేరుతో శివాజీ విడుద‌ల చేసిన వీడియోను పరిశీలించి అత‌డిపై కేసు నమోదు చేయాలని ఏపీ డీజీపీ  మాలకొండయ్యను మాణిక్యాల‌రావు కలిశారు. అటువంటి అభ్యంత‌ర‌క‌ర‌మైన వీడియోను విడుద‌ల చేసిన శివాజీపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అత‌డిపై కేసు న‌మోదు చేయాల‌ని ఆయ‌న డీజీపీని కోరారు. ఆపరేషన్‌ ద్రవిడ వీడియోపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ మాలకొండయ్యకు మాణిక్యాల రావు వినతిపత్రం ఇచ్చారు.
Tags:    

Similar News