ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌ ను కాపాడిన మ‌న్మోహ‌న్ సింగ్‌

Update: 2017-01-18 14:06 GMT
పార్ల‌మెంట‌రీ క‌మిటీ ముందు నోట్ల ర‌ద్దు అంశంపై  ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ఉర్జిత్ ప‌టేల్ వివ‌రణ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా మాజీ ప్ర‌ధాన‌మంత్రి మన్మోహ‌న్ సింగ్ ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌ ను ఇర‌కాటంలో ప‌డ‌కుండా చూశార‌ని స‌మాచారం. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ వివ‌రిస్తున్న స‌మ‌యంలో కాంగ్రెస్ ఎంపీ ఒక‌రు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌ కు సంక్లిష్ట‌మైన ప్ర‌శ్న సంధించారు. అప్పుడు మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ వెంట‌నే జోక్యం చేసుకుని దానికి స‌మాధానం ఇవ్వ‌రాద‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌ ను అడ్డుకున్న‌ట్లు తెలుస్తున్న‌ది. నోట్ల ర‌ద్దు వ‌ల్ల ప్ర‌స్తుతం విత్‌ డ్రాపై ఆంక్ష‌లు విధించారు. ఒక‌వేళ ఆంక్ష‌లు తొలిగిస్తే, గంద‌ర‌గోళం నెల‌కుంటుందా అని కాంగ్రెస్ నేత ప్ర‌శ్నించారు. ఆ ప్ర‌శ్న‌కు బ‌దులివ్వ‌బోయిన ఉర్జిత్ ప‌టేల్‌ ను మ‌న్మోహ‌న్ అడ్డుకున్నారు. ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇవ్వొద‌న్నారు. ఆర్బీఐని ఇబ్బందుల్లో ప‌డేసే ప్ర‌శ్న‌ల‌కు బ‌దులు ఇవ్వ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో ఉర్జిత్‌ను బ‌హుశా మ‌న్మోహ‌న్ ఆదుకుని ఉంటార‌ని స్టాండింగ్ క‌మిటీ స‌భ్యులు అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇదిలాఉండ‌గా...పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత రూ.9.2 ల‌క్ష‌ల కోట్ల కొత్త క‌రెన్సీ ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ఉర్జిత్ ప‌టేల్ తెలిపారు. పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీ విచార‌ణ ముందు ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు. పార్ల‌మెంట‌రీ క‌మిటీల‌తో స‌మావేశం కానున్న నేప‌థ్యంలో ఆర్బీఐ చీఫ్ నోట్ల ర‌ద్దు అంశంపై ఇటీవ‌ల ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు .పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేయాల‌ని ప్ర‌ధాని మోదీ న‌వంబ‌ర్ 7న ఆదేశించార‌ని, దానికి మ‌రుస‌టి రోజున క్లియ‌రెన్స్ ఇచ్చామ‌ని, ఆ తర్వాత ప్రధాని చేసిన ప్రకటనతో నోట్ల ర‌ద్దు న‌వంబ‌ర్ 8వ తేదీ నుంచి అమ‌లులోకి వ‌చ్చిన‌ట్లు ఆ లేఖ‌లో ఆర్బీఐ చీఫ్ తెలిపారు. నోట్ల ర‌ద్దు చ‌ట్ట‌ప‌ర‌మైన అంశ‌మా కాదా అన్న కోణంలో కూడా క‌మిటీ స‌భ్యులు ఆర్బీఐ చీఫ్‌ ను ప్ర‌శ్నించిన‌ట్లు తెలుస్తున్న‌ది. కాగా...నోట్ల ర‌ద్దు అంశం ప‌ర్య‌వ‌సానాల‌పై 2016 ఆరంభం నుంచే అంచ‌నాలు వేస్తున్నట్లు స్టాండింగ్ క‌మిటీకి ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు వెల్ల‌డించిన‌ట్లు తెలుస్తున్న‌ది.

గ‌త ఏడాది న‌వంబ‌ర్ 8వ తేదీన ప్ర‌ధాని మోదీ రూ.500 - వెయ్యి నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ అంశంలో ఆర్బీఐ పాత్ర‌పై ఉర్జిత్ ప‌టేల్‌ ఇవాళ ఓ పార్ల‌మెంట‌రీ క‌మిటీతో భేటీ కావాల్సి వ‌చ్చింది. వీర‌ప్ప మొయిలీ నేతృత్వంలోని స్టాండింగ్ క‌మిటీతో ఇవాళ ఉర్జిత్ భేటీ అయ్యారు. మ‌ళ్లీ శుక్ర‌వారం రోజున థామ‌స్ నేతృత్వంలోని మ‌రో స్టాండింగ్ క‌మిటీతో ఆర్బీఐ చీఫ్ మాట్లాడ‌నున్నారు. పెద్ద నోట్ల ర‌ద్దు వ‌ల్ల బ్యాంకులకు ఎంత సొమ్ము వ‌చ్చింద‌న్న విష‌యాన్ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ వెల్ల‌డించ‌లేక‌పోయారని తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగ‌త్ రాయ్ తెలిపారు. నోట్ల ర‌ద్దు వ‌ల్ల అస్త‌వ్య‌వ‌స్త‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ ఎప్పుడు మ‌ళ్లీ సాధార‌ణ స్థితికి వ‌స్తుంద‌న్న దానిపై ఉర్జిత్ స‌రైన స‌మాధానం ఇవ్వ‌లేద‌ని టీఎంసీ నేత అన్నారు. ఆర్బీఐ అధికారులు నోట్ల ర‌ద్దు అంశంపై ర‌క్ష‌ణాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించార‌న్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News