డీఏ నిలుపుదల ..సరైన నిర్ణయం కాదన్న మాజీ ప్రధాని !

Update: 2020-04-26 01:30 GMT
కరోనా వైరస్ సంక్షోభం కారణంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షన్‌ దారులకు ఇటీవల పెంచిన కరువు భత్యాన్ని (డీఏ) కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. 2021 జూలై వరకు పెంచిన డీఏ చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. దీనిపై మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ స్పందించారు. ప్రస్తుత సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల డీఏను నిలిపివేయడం స‌రికాద‌న్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగులు, ర‌క్ష‌ణ ద‌ళాల‌పై భారం వేయ‌డం మంచి నిర్ణయం కాదు అని అన్నారు.

ఈ నిర్ణయం ప్రభావం 50 లక్షల మంది ఉద్యోగులతోపాటు 61 లక్షల మంది పింఛనుదారులపై పడనుంది. సాధారణంగా ప్రతి ఏటా రెండుసార్లు (జనవరి, జూలైలో) ద్రవ్యోల్బణం మేరకు ఉద్యోగుల కరువు భత్యాన్ని సవరిస్తారు. కేంద్ర ప్రభుత్వం గత నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం కరువు భత్యం (డీఏ), పెన్షర్లకు 21 శాతం కరువు సాయాన్ని పెంచింది. అయితే , కరోనా తో ఉత్పన్నమైన సంక్షోభం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్ర పింఛనుదారులకు 2020 జనవరి 1వ తేదీ నుంచి చెల్లించాల్సిన అదనపు వాయిదా డీఏను 2021 జూన్‌ 30 వరకు నిలిపివేయాలని నిర్ణయించడమైంది అని ఆర్థిక శాఖ తెలిపింది.
Tags:    

Similar News