మోడీ ఫెయిల్.. మన్మోహనే బెస్ట్..90శాతం మద్దతు!

Update: 2020-08-18 17:00 GMT
భారత దేశాన్ని తన ఆర్థిక సంస్కరణలు.. పాలనతో అభివృద్ధి పథాన నిలిపారు కాంగ్రెస్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. మన్మోహన్ పాలనలో మన దేశ జీడీపీ ఏకంగా 12శాతం వరకు ఎగబాకింది.

కానీ మన బీజేపీ ప్రధాని నరేంద్రమోడీ హయాంలో మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. నిజానికి మోడీ ముందూ వెనుకా ఆలోచించకుండా చేసిన నోట్ల రద్దుతోనే భారత ఆర్థిక వ్యవస్థ షేక్ అయ్యింది. 12శాతంతో దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థను 5శాతానికి మోడీ తగ్గించారనే అపవాదును మూటగట్టుకున్నారు.

ఇప్పుడు కరోనా దెబ్బకు ఏకంగా 3శాతానికి మన ఆర్థిక వ్యవస్థ పడిపోయిందన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. మైనస్ లోకి జారిపోయిందని అనేవారు ఉన్నారు.

స్వయంగా ఆర్థిక వేత్త అయిన మన్మోహన్ సింగ్ దేశాన్ని పాలించడం.. పైసలు పుట్టించడంలో.. పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి విషయంలో సంస్కరణలు చేసి దేశాన్ని పరుగులు పెట్టించారు.

కానీ నోట్ల రద్దు నుంచి జీఎస్టీ సహా పన్ను సంస్కరణలు.. కరోనా టైంలో చేతులెత్తేసి మోడీ దేశాన్ని ఆర్తిక మందగమనంలోకి తీసుకెళ్లాడని మేధావులు అంటున్నారు.

ఆర్తిక వేత్తల అభిప్రాయం ప్రకారమే.. తాజాగా ఫేస్ బుక్ లో ఓ జాతీయ చానెల్ సర్వే చేపట్టింది. ‘‘మన్మోహన్ పాలన బాగుందా? లేక ప్రధాని మోడీ పాలన బాగుందా? ఇద్దరిలో ఎవరి పాలన బెస్ట్’’ అని పోటీపెట్టగా.. నరేంద్రమోడీ తేలిపోయారు. ఏకంగా 90శాతం ఓట్లు మన్మోహన్ కే పడడం సంచలనమైంది. మోడీ పాలనకు కేవలం 10శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి.

సాయంత్రం 7 గంటల వరకు పోల్ రిజల్ట్ చూస్తే ఏకంగా 94వేల ఓట్లు మన్మోహన్ కు పడగా.. కేవలం 9167 ఓట్లు మాత్రమే మోడీకి పడ్డాయి. అంటే దాదాపు 90శాతం వరకు మన్మోహన్ పాలన బాగుందని ప్రజలు, నెటిజన్లు కితాబిచ్చారు. దీన్ని బట్టి మోడీ పాలన ఏ తీరుగా ఉందో అర్థం చేసుకోవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News