సాయం కోసం ఎవరి దగ్గరకు వెళ్లాలి. మామూలు జనాలు అయితే ఇచ్చే సాయం అంతంతమాత్రమే ఉంటుందనుకున్నారో ఏమో కానీ.. టాలీవుడ్ కు చెందిన కొందరు నటీనటులు హైదరాబాద్ లోని పలు షాపింగ్ మాల్స్ మీద పడ్డారు. వీకెండ్ షాపింగ్ తో బిజీబిజీగా ఉండే వారికి సర్ ప్రైజ్ ఇస్తూ విరాళాల కోసం వచ్చేశారు. ఆదివారం హైదరాబాద్ లోని పలు మాల్స్ లో నిర్వహించిన ఈ కార్యక్రమం పబ్లిసిటీ స్టంట్ గా పని చేసిందే తప్పించి పెద్దగా వర్క్ అవుట్ అయినట్లు కనిపించలేదు.
సినీ తారలు కాజోల్.. రానా.. అల్లరి నరేష్.. మంచు లక్ష్మి.. తేజస్వి లాంటి తారలంతా చెన్నై వరద బాధితులకు సాయంగా ఉండేందుకు హైదరాబాద్ లోని వివిధ షాపింగ్ మాల్స్ ను సందర్శించి.. అక్కడి అభిమానుల నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. ఇందుకోసం కొన్ని ప్రముఖ మాల్స్ ను ఎంపిక చేశారు. అయితే.. విరాళాల సేకరణ వ్యవహారం అంతా పబ్లిసిటీ స్టంట్ గా కనిపించిందే తప్పంచి ఎలాంటి ఫలితం ఇవ్వటం లేదు. దీనికి తోడు కొన్ని మాల్స్ లో జనం అత్యుత్సాహంతో వ్యవహరించటంతో ఈ కార్యక్రమం మొత్తం రచ్చ రచ్చగా మారింది.
విరాళాల కోసం షాపింగ్ మాల్ కి వచ్చిన తారల్ని చూసిన మాల్స్ లోని జనం వారిని టచ్ చేసేందుకు.. వారితో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించటంతో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వారికి దగ్గరగా రావాలని పెద్ద ఎత్తున ప్రయత్నం జరగటంతో తొక్కిసలాట.. గందరగోళానికి దారి తీశాయి. ఇలాంటి పరిస్థితి ఏర్పటానికి కార్యక్రమ నిర్వాహకుల ప్లానింగ్ లోపంగా కూడా చెప్పొచ్చు.
అయినా.. విరాళాల సేకరణ అన్నకార్యక్రమం సీరియస్ గా.. చెన్నై ప్రజలను ఆదుకునేదిలా ఉండాలే తప్పించి.. ఏదో పబ్లిసిటీ కోసమన్నట్లుగా సాగకూడదు.అ యినా.. షాపింగ్ మాల్స్ లోకి వెళ్లి.. చెన్నైకి సాయం చేద్దాం.. మీకు తోచిన సాయం ఇవ్వమంటే ఎంతిస్తారు? వంద రెండొందలు.. లేదంటే ఐదొందలు.. మహా అయితే వెయ్యి. అయినా ఒక మాల్ లో ఎంతమంది ఉంటారు? మహా అయితే.. వెయ్యి అది కూడా ఎక్కువ. తారలు ఎంచుకున్న మాల్స్ లో బాగా పెద్దది కూకట్ పల్లిలో ఉన్న సుజనా ఫోరం మాల్ ఒక్కటే. ఈ మాల్ లో తక్కువలో తక్కువ రెండు వేల నుంచి 3.5వేల మంది వరకూ ఉండొచ్చని అంచనా.
ఇంత మంది ఉన్నా.. తారల మీద క్రేజ్ తో వారిని చూసేందుకు.. వారిని టచ్ చేసేందుకు.. సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారే తప్పించి.. విరాళాలు ఇచ్చింది లేదు. మరోవైపు తారల తీరు కూడా ఆక్షేపించేదిగానే ఉంది. ఒంటికి కొట్టుకున్న పెర్ ఫ్యూమ్ స్మెల్ కూడా పోకూదన్నట్లుగా మాల్స్ లో తిరిగి విరాళాలు సేకరించాలని అనుకోవటం ఏమిటి? ఓపక్క తమిళ యాక్టర్లను చూసైనా నేర్చుకోవాల్సింది. బాధితుల వద్దకు నేరుగా వెళ్లి.. బురదలోనూ.. వర్షపు నీటిలోనూ తిరిగి రియల్ హీరోలుగా వ్యవహరిస్తే.. మనోళ్లు మాత్రం మాల్స్ చుట్టూ తిరిగేసి సాయం కోసం మేం ఎంతగా శ్రమించామో అన్న మాట చెప్పుకోవటానికే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. ప్రచారం మీద ఫోకస్ పెట్టే కన్నా.. చెన్నైకు వీలైనంత ఎక్కువ సాయం చేయాలన్న ఆలోచన మీద నిజంగా దృష్టి పెడితే.. బాగుండేదేమో.