పేరుకు డిజిటల్ యుగమనే కానీ.. కొన్ని విషయాల్లో ఇప్పటికీ పాత వాసనలు పోని దుస్థితి. మిగిలిన వాటి సంగతి ఎలా ఉన్నా.. రాజకీయాల్లో మతం.. కులం ప్రభావం ఎంతో అందరికి తెలిసిందే. ఇప్పటికి ఆ బంధనాల నుంచి ఎవరూ బయటకు రాని పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఒక ముఖ్యమంత్రి తన ఇంటిపేరును వదిలేసుకోవటం ఆసక్తికరంగా మారింది.
తన ఇంటి పేరుతో తన కులాన్ని తెలిపే అవకాశం ఉండటం.. అలాంటివి ఇష్టం లేని ఆయన.. తన ఇంటిపేరును ఇకపై వినియోగించొద్దని చెప్పటమే కాదు.. తన అధికారిక కార్యాలయంలో తన ఇంటిపేరును వాడొద్దని ఇప్పటికే ఫర్మానా జారీ చేశారు. ఇంటిపేరును ఓటు బ్యాంకుగా మార్చుకొని.. అధికారానికి మరింత దగ్గర కావాలని చూస్తున్న ఈ రోజుల్లో.. ఇంటి పేరును వదిలించేందుకు ఎలాంటి మొహమాటానికి గురి కానీ ఈ ముఖ్యమంత్రి మరెవరో కాదు.. హర్యానా సీఎంగా వ్యవహరిస్తున్న మనోహర్ లాల్ ఖట్టర్. ఇలాంటి దమ్ము.. ధైర్యం దేశంలో మరెంత మంది ముఖ్యమంత్రులకు ఉందంటారు?