ఇటీవల వెలువడిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీని సాధించపెట్టలేకపోయాయి. హంగ్ ఏర్పడ్డ హర్యానా అసెంబ్లీలో ఇప్పుడు చిన్న పార్టీలు - స్వతంత్రుల మద్దతు కీలకంగా మారింది. అయితే కేంద్రంలో అధికారంలో ఉండడంతో బీజేపీకి కాస్త అనుకూలమైన వాతావరణం నెలకొంది.
తాజాగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ రెబల్ అభ్యర్థి రణ్ ధీర్ గోలన్ తన మాతృసంస్థ బీజేపీకే మద్దతు పలకడంతో హర్యానా రాజకీయం రసవత్తరంగా మారింది. 30 ఏళ్లుగా బీజేపీలో కార్యకర్తగా పనిచేశానని.. ఆపార్టీకి వ్యతిరేకంగా రెబల్ గా పోటీచేసినా తన మద్దతు ఎప్పుడూ బీజేపీకేనని రణ్ దీర్ పేర్కొన్నారు. ఈ ఎమ్మెల్యే మద్దతుతో బీజేపీ బలం 41కి చేరింది. ఇక రణధీర్ బాటలోనే దాద్రి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన ఎమ్మెల్యే సోమవీర్ సంగ్వాన్ కూడా బీజేపీకే మద్దతు పలికారు. మరో నలుగురు ఎమ్మెల్యేలు మద్దతు దొరికితే హర్యానాలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయం..
ఇప్పటికే దాదాపు 10మంది వరకు గెలిచిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగి సంప్రదింపులు జరుపుతోంది. అమిత్ షా సైతం హర్యానాలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా చక్రం తిప్పుతున్నట్టు తెలిసింది.
మొత్తం మీద హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోంది. మరోసారి మనోహర్ లాల్ ఖట్టర్ సీఎం అవ్వడం ఖాయమేనన్న అంచనాలు నెలకొంటున్నాయి.