ముఖ్యమంత్రిగా తన మానాన తాను బుద్దిగా రాష్టాన్ని ఏలేస్తూ.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్న నేతను ఢిల్లీకి తీసుకొచ్చిన బీజేపీకి.. ఆయన గారి విలువ ఇప్పుడు మరింత బాగా తెలిసింది. గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారీకర్ సొంతం చేసుకున్న ఇమేజ్ అంతాఇంతా కాదు. సింఫుల్ గా ఉండటం.. సగటు రాజకీయ అధినేతకు భిన్నమైన తీరుతో పాటు.. నిజాయితీ పెట్టని కోటగా ఉండే ఆయన్ను గోవా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి ప్రధాని పట్టుబట్టి తీసుకురావటం తెలిసిందే. గోవాను వదిలేసి ఢిల్లీకి వెళ్లటం పారీకర్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. ఆ విషయాన్ని పలుమార్లు బయటకు చెప్పేశారు కూడా.
కానీ.. కేంద్ర రక్షణ మంత్రిలాంటి భారీ బాధ్యత ఇస్తున్న వేళ.. ప్రధాని మోడీ మాట కాదనలేక ఆయన వచ్చారు. మనోహర్ పారీకర్ ను తేవటమైతే తెచ్చారు కానీ.. ఆయనకు ప్రత్యామ్నాంగా అవకాశం ఇచ్చిన లక్ష్మీకాంత్ పర్సేకర్ సరిగా వినియోగించుకోలేకపోయినట్లుగా చెబుతున్నారు. తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గోవా కూడా ఒకటి ఉంది. మనోహర్ పారీకర్ ఉంటే పరిస్థితి మరోలా ఉండేది కానీ.. ఆయన ఢిల్లీకి వెళ్లిపోవటంతో రాష్ట్రంలో సమీకరణాలు మారినట్లుగా చెబుతున్నారు.
దీంతో..బీజేపీకి గోవాలో ఇబ్బందికర పరిస్థితి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో.. దిద్దుబాటు దిశగా కమలనాథులు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కానీ పవర్ లోకి వస్తే.. తర్వాతి ముఖ్యమంత్రిగా మనోహర్ పారీకర్ వ్యవహరిస్తారని చెబుతున్నారు. ఇదే విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించటం ఆసక్తికరంగా మారింది. నేను ఢిల్లీకి వెళ్లను బాబు అంటే బలవంతానా తీసుకెళ్లి.. ఈ రోజు మళ్లీ గోవాకు పంపేందుకు చేస్తున్న కసరత్తు చూస్తే.. భవిష్యత్తు పరిణామాల్ని మోడీ అండ్ కో సరిగా అంచనా వేయటం లేదా? అన్న సందేహం కలగక మానదు. మరోవైపు.. తనను గోవాకు మళ్లీ పంపించనున్నారన్న వైనంపై మనోహర్ పారీకర్ హ్యాపీగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/