గోవా సీఎం రాజీనామా?

Update: 2018-09-15 05:27 GMT
నిలువెత్తు నిజాయితీ.సాదాసీదాగా వ్య‌వ‌హ‌రించే తీరుతో రాష్ట్రాల‌కు అతీతంగా దేశ ప్ర‌జ‌లు మ‌నోహ‌ర్ పారీక‌ర్ ను అభిమానిస్తుంటారు. కేంద్ర మంత్రి స్థాయి నుంచి.. గోవా రాష్ట్ర ముఖ్య‌మంత్రి వ‌ర‌కు అత్యున్న‌త ప‌ద‌వుల్ని చేప‌ట్టి కూడా సింఫుల్ గా ఉండ‌టం.. స‌గ‌టు జీవుల‌తో మ‌మేక‌మై ఉండ‌టం పారీక‌ర్ ప్ర‌త్యేక‌త‌.

గ‌డిచిన కొద్ది నెల‌లుగా ప్యాంక్రియాటిక్ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆయ‌న అమెరికాలో చికిత్స పొందుతున్న వైనం తెలిసిందే. ఏడు నెలలుగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్న ఆయ‌న చికిత్స కోసం మ‌ళ్లీ అమెరికాకు వెళ్లాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో తాన ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

అమెరికాలో చికిత్స తీసుకొని గోవా వ‌చ్చిన ఆయ‌న చికిత్స కోసం కండోలిమ్‌లోని ఒక ఆసుప‌త్రిలో చికిత్స కోసం చేరారు. ఇప్ప‌టికే త‌నను ప‌ట్టి పీడిస్తున్న వ్యాధికి చికిత్స కోసం మూడుసార్లు అమెరికాకు వెళ్లిన ఆయ‌న తాజాగా మ‌రోసారి వెళ్లాల్సి రావ‌టంతో  త‌న సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు నిర్ణ‌యించుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఇదే అంశాన్ని ప్ర‌ధాని మోడీ.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాతో చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం. గ‌డిచిన ఏడు నెల‌లుగా అనారోగ్యానికి గురైన పారీక‌ర్‌.. పాల‌న మీద ఏ మాత్రం దృష్టి పెట్ట‌లేక‌పోతున్నారు.ఇలాంటి వేళ‌లో సీఎం ప‌ద‌విని వ‌దులుకోవ‌టానికి మ‌నోహ‌ర్ సిద్ధ‌ప‌డిన‌ట్లుగా స‌మాచారం. పాడు ప్యాంక్రియాటిక్.. మ‌నోహ‌ర్ పారీక‌ర్ లాంటి మంచోడినే అంత‌లా ప‌ట్టి పీడించాలా?
Tags:    

Similar News