మనోజ్ తివారీ .. నటుడు, గాయకుడు, బీజేపీ ఎంపీ. రెండోసారి రెండో భార్య ద్వారా తండ్రి అయ్యాడు. 50 ఏళ్ల వయసులో ఆయన రెండో బిడ్డకు తండ్రి అయ్యాడు. అయన 2011లో రాణి అనే యువతిని పెళ్లి చేసుకొన్నారు. దాదాపు 11 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం అభిప్రాయబేధాలు రావడంతో విడాకులు తీసుకొన్నారు. రాణి, మనోజ్ తివారీకి ఓ కూతురు ఉంది. ప్రస్తుతం శ్వేతా తివారీ ద్వారా రెండో బిడ్డకు జన్మనిచ్చారు. తన కూతురు పుట్టిన విషయంపై ట్విట్టర్‌లో స్పందిస్తూ.. మా ఇంటిలోకి ముద్దుల పాపాయి అడుగుపెట్టింది. నాకు డిసెంబర్ 30వ తేదీన ఆడబిడ్డ జన్మించింది. జై జగదాంబ అంటూ మనోజ్ తివారీ ట్వీట్ చేశారు. తన కూతురును ఒడిలో పెట్టుకొని ఉన్న ఫోటోను షేర్ చేశారు. మనోజ్ కుమార్‌ను ప్రముఖులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు అందించారు
రాజకీయ జీవితం విషయానికి వస్తే.. 2008లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. సమాజ్ వాదీ పార్టీ తరఫున గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి యోగా ఆదిత్యానాథ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన మనోజ్ తివారీ తత్తర ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో మనోజ్ తివారీ స్టార్ హీరోగా రాణించారు. రాజకీయాల్లో క్రీయాశీలకంగా మారకముందు చివరిసారిగా 2014లో దేవ్రా భెయిల్ దీవానా చిత్రంలో నటించారు. 2010లో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు.