ఇంతకు మించిన బ్యాడ్ లక్ ఇంకేం ఉంటుంది? గురి కుదిరింది.. పిస్టల్ పని చేయలేదు
ప్రతిభ ఉండగానే సరిపోదు. దాన్ని ప్రదర్శించే వేదిక ఉండాలి. ఒకవేళ వేదిక మీద ప్రదర్శించే అవకాశం రాగానే సరిపోదు.. అంతో ఇంతో అదృష్టం కూడా మనవైపు ఉండాలి. అప్పుడు మాత్రమే అద్భుతాలు చేయటానికి అవకాశం ఉంటుంది. తాజాగా అలాంటి అదృష్టం మిస్ అయిన క్రీడాకారిణికి చేదు అనుభవం ఎదురైంది. ఎంతగా కష్టపడినా ఆమె శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. తాజాగా టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత్ కు పతకాల్ని తీసుకొస్తారని భావించిన షూటర్లు తాజాగా తీవ్ర నిరాశకు గురయ్యారు.
ప్రపంచ కప్ తో సహా పలు టోర్నీల్లో మెరిసిన మన షూటర్ మను బాకర్.. తాజాగా పతకాన్ని చేజార్చుకుంది. ఇందులో ఆమె తప్పు కంంటే కూడా ఆమె పిస్టల్ ఎక్కువ తక్కువ చేసినట్లుగా చెప్పాలి. అయినప్పటికి చివరికంటా పోరాడినప్పటికి ఆమె ప్రయత్నం ఫలించలేదు. దీంతో.. ఫైనల్ బెర్త్ ను త్రుటిలో తప్పింది. తీవ్ర నిరాశకు గురి చేసిన మను బకర్ ఉదంతం గురించి తెలిస్తే అయ్యో అనకుండా ఉండేలం.
భారీ అంచనాలతో బరిలోకి దిగిన మను బాకర్ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ లో పతకం ఖాయమన్న అంచనా భారీగా వినిపించింది. అందుకు తగ్గట్లే ఆమె తన ప్రతిభను ప్రదర్శించినా.. కీలక వేళలో ఆమె పిస్టల్ లో సాంకేతిక సమస్య చోటు చేసుకుంది. దాన్ని సరి చేసుకొనేసరికి పుణ్యకాలం గడిచిపోయింది. అయినప్పటికీ తన వంతుగా ఎంత ప్రయత్నించాలో అంత చేసినా.. ఆమె ఫైనల్ కు క్వాలిఫై కాలేకపోయారు. ఇంతకూ అసలేం జరిగిందంటే.. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఫైనల్ కు బెర్త్ సంపాదించుకున్న క్రీడాకారిణికి కేవలం రెండు పాయింట్ల దూరంలో నిలిచి.. అవకాశాన్ని మిస్ చేసుకుంది మను బాకర్.
ఆమె ప్రదర్శన బాగానే ఉన్నా.. ఆమె ఉపయోగించిన పిస్టల్ లో ఏర్పడిన సాంకేతిక సమస్య.. ఆమె అవకాశాన్ని చేజార్చింది. పిస్టల్ లో ఏర్పడిన సాంకేతిక సమస్య విలువైన 20నిమిషాల సమయాన్ని వేస్ట్ చేసింది. ఒకవేళ పిస్టల్ లో సాంకేతిక సమస్య ఏర్పడకపోతే మాత్రం కచ్ఛితంగా ఆమె ఫైనల్ కు బెర్తును ఖరారు చేసుకునేది. ఈ పోటీలో ఒక్కో సిరీస్ లో 10షాట్ల చొప్పున ఆరు సిరీస్ లు జరుగుతాయి. 75 నిమిషాల వ్యవధిలో 60 సార్లు లక్ష్యాన్ని చేధించాల్సి ఉంటుంది. మను తొలి సిరీస్ లో 98పాయింట్లతో ఆరంభం అదిరేలా చేసింది. అయితే.. 16 షాట్లు పూర్తి అయ్యాక ఆమె పిస్టల్ మొరాయించింది. సాంకేతిక సమస్య తలెత్తటంతో మరో పిస్టల్ ను నిబంధనల ప్రకారం వినియోగించటానికి వీల్లేదు.
అంతేకాదు.. పిస్టల్ ను బాగు చేసుకోవటానికి అక్కడే చేయకూడదు. అలాంటి పరిస్థితి ఎదురైన వారు పోటీ స్థలం నుంచి బయటకు వెళ్లి సరి చేసుకోవాల్సి ఉంటుంద. మనుకు పిస్టల్ ను సరి చేసుకోవటానికి పది నిమిషాల సమయం పట్టగా.. పోటీ జరిగే ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కు వెళ్లి రావటానికి మరో పది నిమిషాలు పట్టింది. అంతే.. మొత్తం పోటీలో విలువైన 20 నిమిషాల సమయాన్ని చేజార్చుకుంది. అయినప్పటికీ తన ప్రయత్నాన్ని తాను చేసింది. ఈ పోటీలో ఉన్న ఇబ్బంది ఏమంటే.. ఏదైనా సాంకేతిక సమస్య ఏర్పడినా.. అందుకు ఖర్చు అయిన సమయాన్ని అదనంగా ఇవ్వరు. పిస్టల్ ను సరి చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆమె తీవ్రంగా కష్టపడ్డారు. తీవ్రమైన ఒత్తిడిలోనూ దాన్ని అధిగమిస్తూ.. ఫైనల్ అర్హత మార్క్ కు రెండు పాయింట్ల దూరంలో నిలిచిపోవటంతో.. మాంచి అవకాశాన్ని మిస్ అయిన పరిస్థితి. ఎంత కష్టపడినా.. కాలం కలిసి రాకుంటే ఇలాంటి పరిస్థితే ఏర్పడుతుందని చెప్పక తప్పదు.