ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. మాజీ మంత్రి, కందుకూరు మాజీ శాసనసభ్యుడు మానుగుంట మహీధర్‌రెడ్డి త్వరలోనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ గూటికి చేరుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆ మేరకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు,మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ అధినేత జగన్‌ను కలిసి మానుగుంట పార్టీలో చేరిక అంశంపై ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మహీధర్‌రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు బాలినేని కూడా సముఖంగా ఉన్న నేపధ్యంలో త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.
మాజీమంత్రి ఎం.మహిధర్ రెడ్డి గతంలోనే వైసీపీలో చేరాల్సి ఉండగా అనివార్యకారణాల వలన వాయిదాపడింది. ఆ సమయంలో కందుకూరు మునిసిపల్ ఎన్నికలు, ఇతర కారణాల వల్ల మానుగుంట పార్టీలో చేరలేదు. ప్రస్తుతం మాత్రం ముందుగా జడ్‌పిటిసిలు, ఎంపిపిలు, సర్పంచ్‌ల ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపధ్యంలో నియోజకవర్గంలో సమర్థవంతమైన నాయకుడుగా పేరున్న మానుగుంట అవసరం ఉంది. జగన్ ముఖ్యమంత్రి కావాలంటే ప్రతిసీటులో గెలుపుకీలకం కానుంది. ఇందులో భాగంగానే వైసీపీ గెలుపుగుర్రాల వేటలో పడింది. ఈ నేపథ్యంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గమనించి మహీధర్‌రెడ్డిని పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్దమయ్యారు. కందుకూరు నియోజకవర్గంలోని ఎంపీపీ, జడ్‌పిటిసి, సర్పంచ్ ఎన్నికల్లో తమపార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో బాలినేని ఉన్నారు. నియోజకవర్గంలో మానుగుంటకు మంచి పట్టుఉండటంతోపాటు, వైసీపీకి అనుకూలంగా నియోజకవర్గం ఉండటంతో బాలినేని ఆయన చేరికపై ప్రత్యేక దృష్టిసారించారు. అదేవిధంగా త్వరలో కందుకూరుకు మునిసిపల్ ఎన్నికలు కూడా రానున్న నేపధ్యంలో ఆ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలుపించుకోవాలన్న తాపత్రయంలో బాలినేని ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం.
ఇదిలా ఉండగా కందుకూరు నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి గెలుపొందిన పోతుల రామారావు తెలుగుదేశంపార్టీ గూటికి చేరారు. ఈ నేపధ్యంలో ఆ నియోజకవర్గంలో రాజకీయంగా అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం వైసీపీ ఇన్‌చార్జిగా తూమాటి మాధవరావు ఉన్నప్పటికీ పోతుల రామారావును ఎదుర్కొనే సత్తా లేదన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటి తరుణంలో పోతులను ఢీకొనాలంటే సమర్ధుడైన మానుగుంటను రంగంలోకి దించేందుకు బాలినేని పావులు కదిపారు. ప్రధానంగా రానున్న ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులు ఆర్ధికంగా, సామాజికంగా బలోపేతం అయిఉంటే జిల్లాలోని మెజార్టీ స్ధానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని అందువలనే మానుగుంటను పార్టీలోకి చేర్చుకునే పక్రియను బాలినేని తెరపైకి తెచ్చినట్లు సమాచారం. ఈనేపధ్యంలోనే త్వరలోనే కందుకూరు నియోజకవర్గంనుండి మానుగుంట రానున్న ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉన్నట్లు పార్టీవర్గాలద్వారా సమాచారం. ఈ నేపథ్యంలో జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన వెంటనే మానుగుంటపార్టీలో చేరే తేదీ ఖరారు కానుందని సమాచారం.