మావోయిస్టులు మరోమారు తమ ఉనికిని చాటుకున్నారు. ఏకంగా 11మందిని మట్టుబెట్టారు. ఛత్తీస్ గడ్ రాష్ట్రం సుకుమా జిల్లా బెజ్జి అటవీ ప్రాంతంలో ఈరోజు పోలీసులకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో సీఆర్‌పీఎఫ్ 219 బెటాలియన్ కు చెందిన 11 మంది జవాన్ లు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని రాయపూర్ ఆసుపత్రికి తరలించారు. ఈ కాల్పుల్లో కొందరు మావోయిస్టులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఆ వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు.
గత నెలల ఛత్తీస్ గఢ్ లోనే నారాయణపూర్ జిల్లాలోని అకాబీడా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు అక్కడికక్కడే మరణించారు. దీంతో పాటుగా ఇటీవలి కాలంలో వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న మావోయిస్టులు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బెజ్జి అటవీ ప్రాంతలో ఈ ఘటన జరిగింది. కూంబింగ్ చేస్తున్న సీఆర్పీఎఫ్ బలగాల మీదకు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో 11 మంది జవాన్లు మరణించారు. కాగా, ఈ ఘటన తెలుసుకున్న కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాయపూర్ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ నుంచి బయలుదేరుతున్న సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
కాగా, ఈ ఎదురుకాల్పుల్లో మరణించిన వారిలో ఇన్సపెక్టర్ జగ్జీత్ సింగ్ - ఏఎస్ ఐలు నరేందర్ కుమార్ సింగ్ - హెచ్ బీ భట్ - హెడ్ కానిస్టేబుల్ - పీఆర్ మిండే - కానిస్టేబుళ్లు రాంపాల్ సింగ్ యాదవ్ - గోరక్ నాథ్ - మంగేష్ పాల్ పాండే - నందకుమార్ పాత్రా - సతీష్ కుమార్ వర్మ - కే. శంకర్ - సురేష్ కుమార్ ఉన్నారు. గాయపడిన వారిలో హెడ్ కానిస్టేబుల్ జగదీష్ ప్రసాద్ విష్ణోయ్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మరో ఇద్దరు కానిస్టేబుల్లు జైదేవ్ ప్రామాణిక్ - సలీం సైతం చికిత్స పొందుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/