భారతదేశం మొత్తాన్నీ బ్యాంకులు - ఏటీఎంల ముందు నిలబెట్టిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఇప్పుడు మావోయిస్టులను మహా ఇరకాటంలో పడేసింది. అసలే రహస్య జీవితం.. అందులోనూ వరుస ఎన్ కౌంటర్లు - అగ్రనేతలను కోల్పోవడం వంటి కారణాలతో మావోయిస్టులు సతమతమవుతున్న తరుణంలోనే మోడీ నిర్ణయం వారిని మరింత దెబ్బతీసింది. మోడీ నిర్ణయం నల్లధనం - అవినీతి వ్యవస్థలపై అస్త్రంగానే కాకుండా మావోయిస్టుల బలమైన ఆర్థిక మూలాలనూ దెబ్బతీసింది.
మావోయిస్టుల వద్ద సుమారు 7 వేల కోట్ల డబ్బు ఉందని భావిస్తుండగా దాన్ని మార్చుకోవడం వారికి పెద్ద సమస్యగా మారిందని తెలుస్తోంది.
మావోయిస్టుల దగ్గర రూ.7వేల కోట్లకుపైగా నిధులున్నాయని - వాటిని బస్తర్ ప్రాంత అడవుల్లోని డంపర్లలో నిక్షిప్తం చేశారని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం వాటిని స్థానికులు - మద్దతుదారుల సాయంతో ఎక్స్చేంజి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని యాంటీ మావోయిస్టు ఆపరేషన్సు స్పెషల్ డీజీపీ అవస్థి వెల్లడించారు. మూడు రోజుల క్రితం ఛత్తీస్ గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత కొండగావ్ జిల్లాలో ఓ వ్యక్తి నుంచి రూ.500 - రూ.1,000 నోట్లతో కూడిన రూ.44.24 లక్షల నగదు - రూ.2లక్షల విలువైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి వాటికి ఆధారాలు చూపలేకపోయాడని, దీంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అదంతా మావోయిస్టుల డబ్బుగా అనుమానిస్తున్నారు.
కాగా ఏవోబీలోనూ మావోయిస్టుల డంపుల్లో భారీగా నోట్లు ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ప్రభావిత ప్రాంతాల్లో గిరిజనులకు వాటిని చేరవేసి మార్పించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. మరోవైపు పోలీసులు ఇదంతా పసిగట్టి గిరిజనులపై నిఘా పెట్టడంతో మొత్తం మార్చడం కష్టమన్న ఉద్దేశంలో మావోయిస్టులు ఇప్పటికే వాటిని వదులుకోవడానికి సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. కొత్త కరెన్సీ వచ్చాక పోస్టాఫీసులు, ఏటీఎంలు, బ్యాంకులపై దాడికి పథక రచన చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/