ప్రధాని నరేంద్రమోడీ హత్యకు కుట్ర జరిగిందా.? రాజీవ్ గాంధీవలే మోడీని హత్య చేసేందుకు పలు ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నారా.? తాజాగా లీక్ అయిన ఓ లేఖ మోడీపై హత్యకు కుట్ర జరిగినట్లు వాస్తవాలు వెల్లడించింది..
ఉత్తరాదిన భీమా-కొరెగావ్ హింస జనవరి 1న చోటుచేసుకుంది. ఈ హింసలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో సుధీర్ ధవాలే - రోన జాకోబ్ - సురేంద్ర గడ్లింగ్ - మహేష్ రౌత్ - షోమ సేన్ లను పుణే పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం అరెస్ట్ అయిన ఈ ఐదుగురు నిందితులను ప్రశ్నించేందుకు పోలీసు కస్టడీకి అనుమతించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫుణే కోర్టును కోరారు.
వీరిని ప్రాథమికంగా విచారించిన పోలీసులకు భయంకర నిజం వెలుగులోకి వచ్చింది. జాతీయ వార్త ప్రసార మాధ్యమాల్లో ఈరోజు వారు చేసిన కుట్ర కోణంపై కథనాలు వెలువడ్డాయి. రాజీవ్ గాంధీ హత్య తరహాలో మోడీని కూడా చంపేందుకు ఈ పట్టుబడిన ఉగ్రవాదులు ప్రయత్నించినట్లు తెలిసిందని వార్త రాశారు. మోడీ రోడ్ షోలను లక్ష్యంగా చేసుకొని సమగ్రమైన వ్యూహం పన్నారని అందులో పేర్కొన్నారు.
భీమా కోరెగావ్ హింస కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు సమర్పించిన లేఖలో కూడాలో ఈ ఐదుగురు నిందితులు ప్రధాని మోడీ రోడ్ షోలను లక్ష్యంగా చేసుకొని రాజీవ్ గాంధీని హత్య చేసినట్లుగా అదే తరహాలో మోడీని హత్య చేసేందుకు కుట్ర చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రధాని ప్రాణాలకు ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ నిర్ధారించింది.
ప్రధాని మోడీని చంపేందుకు దేశంలోనే కాదు పక్కనున్న పాకిస్తాన్ లో కూడా కుట్ర జరుగుతోంది. 2008 ముంబై పేలుళ్ల కుట్ర దారు హఫీజ్ సయిద్ నేతృత్వంలో నడుస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా (జేయూడీ) కూడా భారత ప్రధాని మోడీని చంపేస్తామంటూ ప్రకటన చేసింది. ఈ మేరకు ఉగ్రవాద సంస్థలోని సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు. దీంతో ప్రధాని పర్యటనల విషయంలో నిఘాను మరింత పటిష్టం చేసేందుకు ఇంటెలిజెన్స్ ప్రయత్నాలు చేస్తోంది.