ఏపీ సీఎం జగన్ తాజాగా టూరిజం శాఖ ఏర్పాటు చేసిన ‘బోట్ కంట్రోల్ రూములను’ ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు క్యార్యాలయం నుంచి పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 9 కంట్రోల్ రూములను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. నదీ తీర పర్యాటక ప్రాంతాల్లో సురక్షిత బోటింగ్ కోసం కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశామని జగన్ తెలిపారు.
ఈ బోట్స్ కంట్రోల్ రూమ్ ప్రారంభోత్సవ సమయంలో ప్రోటో కాల్ ను పాటించలేదని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అనుచరులు తాజాగా నిరసన తెలిపారు. ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని అధికారులు దాచేయడంతో మరింత గొడవ ముదిరింది.
బోట్ కంట్రోల్ రూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా టూరిజం శాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యేల ఫొటోలు వేశారు. కానీ ఇదే ఫ్లెక్సీలో ఎంపీ మార్గాని భరత్ ఫొటో వేయలేదు. శిలాఫలకంపై కూడా ఆయన పేరును చేర్చలేదు. దీంతో ఎంపీ అనుచరులు తిరగబడ్డారు. ప్రారంభోత్సవ సమయంలో నిరసన వ్యక్తం చేశారు.
అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని ఎంపీ భరత్ టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ రసాభాసతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. అధికారుల తీరుపై ఎంపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.