ప్రపంచ వింతల్లో ఒకటిగా.. ప్రపంచ దేశాల్లో ప్రేమకు సజీవ సాక్ష్యంగా కనిపించే తాజ్ మహాల్ అందాలకు మరో ప్రముఖుడు ఫిదా అయిపోయాడు. తాజ్ అందాల గురించి ఈ ప్రముఖుడు ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కాకుంటే.. మేధావిగా గుర్తింపు పొందిన ఈ ప్రముఖుడు ఇంత తెలివితక్కువతనంతో ఎలా ఆలోచించాడా? అన్న ప్రశ్న.. ఇతగాడి ఫేస్ బుక్ పోస్ట్ చూస్తే కలగక మానదు.
తన మనసులో మెదిలిన ఐడియాతో ప్రపంచంలో సరిహద్దుల్లేని ఒక దేశాన్ని తయారు చేసిన ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ తాజాగా తాజ్ మహాల్ ను సందర్శించాడు. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న ఆయన.. అగ్రాలోని తాజ్ అందాల్ని అస్వాదించాలని డిసైడ్ అయ్యాడు. అందుకే అగ్రా వచ్చిన ఆయన.. తాజ్ అందాల్ని చూసి ఫిదా అయిపోయాడు.
ఢిల్లీ ఐఐటీలోని టౌన్ హాల్ లో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్ కు వచ్చిన ఆయన.. పనిలో పనిగా తాజ్ అందాల్ని స్వయంగా చూడాలని డిసైడ్ అయి అగ్రా వచ్చాడు. తాజ్ సందర్శించిన సందర్భంలో ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ పెడుతూ.. తాను భారత్ వచ్చిన విషయాన్ని చెప్పటంతోపాటు.. తాజ్ ను చూసేందుకు వచ్చానని.. తాను ఊహించిన దాని కంటే తాజ్ మహాల్ ఎంతో అందంగా ఉందని.. అదో అపురూప కట్టడమని పొగిడేశాడు. ప్రేమ కోసం ఏమైనా చేయగలమని తాజ్ నిరూపిస్తుందని చెప్పాడు.
జుకర్ బర్గ్ అమాయకత్వం కాకుంటే.. కొన్ని వందల ఏళ్లుగా కోట్లాది మంది తాజ్ అందాలకు ఊరికే పిధా అయిపోతారా? అంత అందమైనది.. అరుదైనది కాబట్టే ఇప్పటికే.. ఎప్పటికీ ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచింది. అయినా.. తాజ్ ను తక్కువ అంచనా వేయాలన్న ఆలోచన జుకర్ కు ఎందుకు వచ్చిందో..? మేధావులు కూడా తప్పుగా ఆలోచిస్తారని జుకర్ తాజా పోస్టింగ్ చూస్తే అర్థం కావట్లేదు.