మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ విషయంలో భారత్ వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ భిన్నంగా రియాక్ట్ అయ్యారు. జాదవ్ విషయంలో పాక్ సైనిక కోర్టు విధించిన ఉరిశిక్షను నిలిపివేయటానికి వీలుగా భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించటం.. ఈ ఉదంతంలో భారత్‌కు అనుకూలంగా తీర్పు రావటం తెలిసిందే.
ఈ తీర్పు వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున సంబరాలు చోటు చేసుకున్నాయి. అయితే.. ఇదంతా అనవసరమని.. భారత్ పెద్ద తప్పు చేసిందన్నది కట్జూ వాదన. అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన భారత్ పెడ్డ తప్పు చేసిందని ఆయన విమర్శిస్తున్నారు.
ఈ చర్యతో పాక్ ఆశల పేటిక తెరుచుకుందని.. ఇకపై వారు భారత్ పై ప్రతిసారీ అంతర్జాతీయ న్యాయస్థానం తలుపు తట్టటం ఖాయమని.. అలా చేసిన ప్రతిసారీ సమాధానం చెప్పుకోవాల్సి చెబుతున్నారు. ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడేందుకు భారత్ ఈ ప్రయత్నం చేస్తే.. ఇప్పుడు కశ్మీర్ లాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలపై పాక్ ఐసీజే తలుపు తట్టే అవకాశం ఉందన్నారు. ఫేస్ బుక్ లో కులభూషణ్ జాదవ్ కేసును ప్రస్తావిస్తూ ఆయన పెట్టిన పోస్టు ఆసక్తకిరంగా ఉంది.
కట్జూ పోస్టులోని కీలకమైన అంశాల్ని చూస్తే.. "ప్రపంచ న్యాయస్థానానికి వెళ్లి భారత్ చాలా తీవ్రమైన తప్పు చేసింది. జాదవ్ విషయంలో ఐసీజే తీర్పు తర్వాత చాలామంది సంబరాలు చేసుకున్నారు. నా అభిప్రాయంలో ఇది చాలా పెద్ద తప్పు. ఇది పాక్ చెప్పు చేతుల్లో మనం ఆడుతున్నట్లు. ఎన్నో విషయాల్ని ఇప్పుడు పాక్ అంతర్జాతీయ కోర్టు జోక్యాన్ని కోరచ్చు. కశ్మీర్ విషయంలో ఏ అంతర్జాతీయ సంస్థకు.. వ్యక్తులకు ఇప్పటివరకూ అనుమతించని మనం ఇప్పుడు పాక్ కానీ ఐసీజేకు వెళితే స్పందించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి కోసం కశ్మీర్ లాంటి సమస్య కూడా ఐసీజేకు వెళ్లేలా చేసింది" అని అన్నారు. తనకు తెలిసినంత వరకూ ప్రస్తుతం పాకిస్థాన్ చాలా హ్యాపీగా ఉండి ఉండొచ్చంటూ కట్జూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/