సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నియమితులు కావడం పట్ల విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ నియామకాన్ని తాను ఎందుకు అంగీకరించానో తన ప్రమాణ స్వీకారం అనంతరం వివరిస్తానని గొగోయ్ మంగళవారం వెల్లడించారు.
సుప్రీం కోర్టుకు చీఫ్ జస్టిస్ గా పని చేసినవారు రాజ్యసభకు వెళ్లడం చాలా చాలా అరుదైన విషయం. గతంలో 1984లో సిక్కుల అల్లర్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి క్లీన్ చిట్ ఇచ్చిన నాటి జస్టిస్ రంగనాథ్ మిశ్రాను కాంగ్రెస్ పార్టీ 1998లో రాజ్యసభకు పంపించింది. ఆయన 2004 వరకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అంతకుముందు ఇతర పదవులు కూడా చేపట్టారు. రంగనాథ్ మిశ్రాకు రాజ్యసభను ఇవ్వడంపై కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి.
మళ్లీ 22 ఏళ్ల తర్వాత రంజన్ గొగోయ్‌ను రాజ్యసభకు పంపించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సుప్రీం కోర్టు మాజీ జడ్జి మార్కండేయ కట్జూ ఈ అంశంపై స్పందించారు. ఈ మేరకు ఆయన తన సామాజిక అనుసంధాన వేదిక లో స్పందించారు.
"తాను 20 ఏళ్ల పాటు లాయర్‌గా ఉన్నానని, మరో 20 ఏళ్ల పాటు జడ్జిగా ఉన్నానని, వృత్తిలో భాగంగా తాను ఎంతోమంది మంచి జడ్జిలను చూశానని, అలాగే చెడు జడ్జిలను కూడా చూశానని కట్జూ పేర్కొన్నారు. కానీ సెక్సువల్ పర్వర్ట్ రంజన్ గొగోయ్ వంటి సిగ్గులేని, అవమానకర జడ్జిలను భారత జ్యూడిసియరీ వ్యవస్థలో తాను మాత్రం ఎప్పుడూ చూడలేదని" మార్కండేయ కట్జూ పేర్కొన్నారు.