ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే.. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ గా వ్యవమరిస్తున్న కందుల నారాయణ రెడ్డి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ఉదయం ఆయన హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మార్కాపురం నుంచి హైదరాబాద్ వెళుతున్న వేళ యర్రగొండపాలెం సమీపంలోని గురిజేపల్లి మూల మలుపు వద్ద ఆయన కారు బోల్తా పడింది.
ఈ ప్రమాదానికి కారణం అతి వేగమేనని చెబుతున్నారు. నారాయణ రెడ్డి తలకు గాయం కాగా.. కుడి కాలు విరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం చోటు చేసుకున్నంతనే స్థానికులు 108కు ఫోన్ చేయటంతో ఆయన్ను యర్రగొండపాలెంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్.. ఆయన మాత్రమే ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ స్వల్పంగా గాయపడినట్లు చెబుతున్నారు.
వేగంగా వెళుతున్న కారు మూల మలుపు వద్ద అదుపు తప్పినట్లుగా చెబుతున్నారు. రోడ్డు పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లి.. బోల్తా పడింది. ఈ ప్రమాదంలోకారు కూడా ధ్వంసమైంది.
సోమవారం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్ చేస్తున్న యువగళం పాదయాత్ర వందో రోజుకు చేరుకున్న నేపథ్యంలో.. ఆయనకు సంఘీభావంగా మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలిలో పాదయాత్ర చేపట్టారు.
వ్యక్తిగత పని మీద హైదరాబాద్ కు బయలుదేరిన ఆయన.. మార్గమధ్యలో రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై నియోజకవర్గంలోని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.