జెంటిల్ మేన్ గా చెప్పుకునే తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో మర్రి శశిధర్ రెడ్డి ఒకరు. అనవసరమైన వ్యాఖ్యలు.. సంచలనాల కోసం ఇష్టారాజ్యంగా మాట్లాడే పద్ధతికి ఆయన కాస్త విరుద్ధం. పాత తరం రాజకీయాలకు ప్రతినిధిగా వ్యవహరించే ఆయన తాజాగా గవర్నర్ నరసింహన్ మీద విరుచుకుపడ్డారు.
తాజాగా ఆయన తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారికి ఒక లేఖ రాశారు. అందులో తలసాని శ్రీనివాస్ యాదవ్ తన పదవికి రాజీనామా చేశారా? లేదా అని ప్రశ్నిస్తున్నారు. తన ప్రశ్నకు సమాధానం చెప్పాలని ఆయన కోరారు. మరోవైపు.. గవర్నర్ నరసింహన్ తీరుపై కూడా ఆయన తప్పు పట్టారు.
అధికారికంగా తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఉన్న తలసానిని.. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా గవర్నర్ నరసింహన్ ఎలా ప్రమాణస్వీకారం చేయిస్తారని ప్రశ్నించారు. గవర్నర్ తన పదవి నుంచి తప్పుకోవాలని.. రాజ్యాంగాన్ని తప్పుదారి పట్టించేలా వ్యవహరించిన గవర్నర్ ఆ పదవిలో కొనసాగేందుకు అర్హత లేదని మండిపడ్డారు. హుందాగా ఉండే శశిధర్ రెడ్డి ఈ స్థాయిలో విరుచుకుపడటం ఆశ్చర్యకరంగా మారింది.