కాంగ్రెస్ కు మర్రి శశిధర్ రెడ్డి గుడ్ బై?

Update: 2021-06-27 16:30 GMT
తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం కాంగ్రెస్ లో చిచ్చు రేపుతోంది. ఆ పార్టీలో అసంతృప్తి జ్వాల ఎగిసిపడుతోంది. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంపై నిన్న మాజీ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేయగా.. ఈరోజు కోమటిరెడ్డి గళమెత్తారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రిశశిధర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తూ సోనియాగాంధీకి లేఖ రాశారు. ఈ పరిణామం కాంగ్రెస్ వర్గాల్లో సంచలనమైంది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు , పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఏఐసీసీ తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీకి పంపించారు.

మేడ్చల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన మరుసటి రోజే మర్రి శశిధర్ రెడ్డి ఆ కీలక పదవి నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది. ప్రకంపనలు సృష్టించింది.

కొత్త తెలంగాణ పీసీసీ ఏర్పాటు కావడం వల్ల ఇప్పటిదాకా మనుగడలో ఉన్న పాతవన్నీ రద్దయినట్టే .రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన కొత్త పీసీసీలో కాంగ్రెస్ సీనియర్లకు అసలు చోటునే లేదు. కొత్త చైర్మన్లను ప్రకటించాల్సి ఉంటుంది.

అయితే పీసీసీకి ప్రస్తుతం మర్రి శశిధర్ రెడ్డి ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. కొత్త కార్యవర్గం ఏర్పాటు కావడంతో ఆ పదవికి రాజీనామా చేసినట్లు మర్రి శశిధర్ రెడ్డి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కొత్త ఎన్నికల కమిటీ నియామకానికి రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలనే ఉద్దేశంతోనే తప్పుకుంటున్నట్టు తెలిపారు.

తాను కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా విధేయుడిగానే ఉంటానని.. కాంగ్రెస్ కు చెందిన వ్యక్తిగా పార్టీలో శాయశక్తుల కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఇప్పటికే రేవంత్ నియామకం పై మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అలిగి పార్టీకి రాజీనామా చేశారు.
Tags:    

Similar News