గ్రీన్ కార్డు కోసం అమెరికన్లతో పెళ్లిళ్లు.. అమెరికా చరిత్రలోనే ఈ మాయలేడి భారీ మోసం
జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసుకునేది పెళ్లి. కానీ అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం ఉండాలంటే అయితే ఏదైనా వృత్తి, ఉద్యోగ, ఉపాధిలో ఉండాలి. లేదంటే అమెరికన్లను వివాహం చేసుకోవాలి. ఈ రెండోదారినే కొందరు క్యాష్ చేసుకున్నారు. అమెరికన్లతో వివాహం అన్నట్టు నాటకం ఆడి వారికి భారీగా డబ్బులు ఇచ్చి మరీ ఈ నకిలీ వివాహాలు చేసుకున్నారు. ఈ భారీ మోసం అమెరికాలో భారీ వివాహాల మోసంగా పేరుగాంచింది.
అమెరికా చరిత్రలో మరో భారీ మోసం వెలుగుచూసింది. అతిపెద్ద వివాహ మోసాలు బయటపడ్డాయి. ఈ కేసులో న్గుయెన్ అనే మహిళకు 120 నెలల జైలు శిక్ష విధించబడింది. యునైటెడ్ స్టేట్స్ చరిత్రలోlo అతిపెద్ద వివాహ మోసాలలో ఒకటిగా దీన్ని గుర్తించారు. 3 సంవత్సరాలుగా ఈ స్కాం జరిగినట్టు తెలుస్తోంది.
న్గుయెన్(58) అనే మహిళ అమెరికాలోని హ్యూస్టన్ ప్రాంతం నుండి ఈ వివాహ మోసాలను చేస్తోందని అమెరికన్ పోలీసుల విచారణలో తేలింది. ఆమె 500 బూటకపు వివాహాలలో పాల్గొన్నట్లు చెబుతారు. అమెరికాలో గ్రీన్ కార్డ్ కోరుకునే ఇతర జాతీయులు.. అమెరికా నివాసితుల మధ్య ఆమె వివాహాలను నిర్వహించింది. జీవిత భాగస్వాములుగా పాల్గొన్న అమెరికా పౌరులకు $15,000 , $20,000 మధ్య చెల్లించింది.
ఈమె వలలో ఎక్కువగా వియత్నం దేశస్థులు చిక్కుకున్నారు. యునైటెడ్ స్టేట్స్‌లోని భార్య లేదా భర్తను వివాహం చేసుకోవడానికి న్గుయెన్ బృందానికి $50,000 నుండి $70,000 వరకు ఇచ్చి మోసపూరితంగా గ్రీన్ కార్డ్ పొందారని పోలీసుల విచారణలో తేలింది. ఆమె నాలుగు సంవత్సరాలకు పైగా ఇలాంటి వివాహాలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసుల ఆపరేషన్ లో ఇవన్నీ బయటపడ్డాయి.
ఈ బూటకపు వివాహాల ద్వారా అనేక మిలియన్లు న్గుయెన్ సంపాదించింది. అసలు పెళ్లి వేడుక జరిగినట్లు కనిపించేందుకు నకిలీ మ్యారేజ్ ఫోటో ఆల్బమ్‌లను ఉపయోగించారు. ఇది సులభమైన వీసా ప్రాసెసింగ్ కోసం ఈ నకిలీ వివాహాలు జరిపించినట్టు విచారణలో తేలింది. న్గుయెన్ కు 120 నెలల జైలు శిక్షతో పాటు $334,605 జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి కెన్నెత్ హోయ్ట్ కోర్డు ఈ మేరకు తీర్పును వెలువరించారు.