ఇదెక్కిడి పోయే కాలం? 4 పిల్లల తల్లి 15 ఏళ్ల బాలుడితో హైదరాబాద్ కు జంప్

Update: 2022-07-28 04:13 GMT
కొంతకాలం క్రితం పశ్చిమ దేశాల్లో జరిగినట్లుగా వార్తలు వచ్చే ఉదంతాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్నాయి. విన్నంతనే ఉలిక్కిపడే ఈ తరహా ఉదంతాలు ఇప్పుడు షాకులు ఇస్తున్నాయి. నలుగురు పిల్లల తల్లి.. పదిహేనేళ్ల బాలుడితో కలిసి సహజీవనం చేయటం.. ఫోన్ లో పోర్న్ వీడియోలు చూపిస్తూ ముగ్గులోకి లాగటం.. గుట్టుగా హైదరాబాద్ కు తీసుకొచ్చేసిన వైనం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. 30 ఏళ్ల వయసున్న గుడివాడకు చెందిన మహిళ.. తన వయసులో సగం మాత్రమే ఉన్న బాలుడితో పథకం ప్రకారం కన్నేయటమే కాదు.. పిల్లాడికి మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకున్న వైనం దిగ్భాంత్రికి గురి చేసింది.

విషయం బయటకువస్తే తమ సంబంధానికి ఇబ్బంది అన్న విషయాన్ని గుర్తించి బాలుడ్ని తీసుకొని హైదరాబాద్ కు వచ్చేసి.. నెలకు పైనే ఉండటం.. పోలీసుల ఎంట్రీతో ఆమె యవ్వారానికి బ్రేక్ పడింది. పెను సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. క్రిష్ణా జిల్లాలోని గుడివాడకు చెందిన 30 ఏళ్ల వివాహిత స్వప్నకు నలుగురు పిల్లలు. అనారోగ్య సమస్యల కారణంగా భర్త వేరే చోట ఉంటున్నాడు.

ఈ క్రమంలో ఎదురింట్లో ఉండే పదిహేనేళ్ల బాలుడి మీద స్వప్న కన్ను పడింది. చనువుగా ఉంటూ.. ఫోన్లో హౌసీ గేమ్ ఆడుతూ దగ్గరైన ఆమె.. తర్వాతి కాలంలో ఫోన్లో పోర్న్ వీడియోలు చూపించేది. ఆ కుర్రాడితో శారీరక సంబంధాన్ని పెట్టుకుంది. ఆ పిల్లాడు స్కూల్ కు వెళ్లకుండా ఎక్కువగా ఆమెతోనే ఉండటం.. వారింట్లోనే ఉండటంతో తల్లిదండ్రులు మందలించేవారు.

దీంతో.. తమ సంబంధం ఎక్కడ చెడిపోతుందన్న ఉద్దేశంతో.. భర్తను వదిలేసిన స్వప్న.. బాలుడ్ని తీసుకొని గుట్టుగా హైదరాబాద్ కు వచ్చేసింది. బాలానగర్ లోని హోటళ్లలోరూం తీసుకోవటానికి ప్రయత్నించగా.. సరైన ఆధారాలు లేవన్న ఉద్దేశంతో ఆమెకు రూం ఇవ్వలేదంటున్నారు. దీంతో ఇంటిని అద్దెకు తీసుకున్న ఆమె.. అక్కడే ఉండసాగింది.

తమ పిల్లాడు కనిపించకుండా పోయాడని బాలుడి తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీరి కోసం గాలిస్తున్నారు. ఇలాంటివేళ.. ఇంటిని వదిలి వచ్చిన బాలుడికి.. తల్లిదండ్రులు గుర్తుకు రావటం.. వెళ్లటానికి వీల్లేకపోవటంతో.. అతడు రహస్యంగా తన తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. దీంతో.. వారు ఆ సమాచారాన్ని పోలీసులకు అందించగా.. స్వప్న ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమె జాడను గుర్తించారు.

ప్రత్యేక టీంతో హైదరాబాద్ వచ్చిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకొని గుడివాడకు వెళ్లిపోయారు. బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రులకు అప్పజెప్పగా.. స్వప్నపై మాత్రం ఫోక్సో చట్టం కింద కిడ్నాప్ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది. వయసులో తన కంటే చిన్నోడు.. మైనర్ అయిన బాలుడ్ని ఇలా ట్రాప్ చేయటమా? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి తోడు నలుగురు పిల్లల్ని వదిలేసి..తన సుఖం కోసం ఇలా పక్కదారి పట్టటం చర్చనీయాంశంగా మారింది.
Tags:    

Similar News