ప్రేయసి పేరుతో టాటూ .. మరో అబ్బాయితో పెళ్లి చేయండి అంటూ సూసైడ్ !

Update: 2021-03-10 00:30 GMT
అన్నదమ్ములిద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు ఒకరినే చాలా గాఢంగా ప్రేమించారు. ఆమెతోనే తమ జీవితం అని అనుకున్నారు. అయితే , ఆ తర్వాత ఏమైందో తెలియదు , ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకొని కన్నుమూశారు. ఈ ఘటన రాజస్తాన్‌ లోని బుంది జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల ప్రకారం..కేశవ్ ‌పుర గ్రామానికి చెందిన మహేంద్ర గుర్జర్ , దేవ్‌ రాజ్ గుర్జర్  అన్నదమ్ములు. అయితే ఒకరికి తెలయకుండా మరొకరు ఒకే అమ్మాయిని గాఢంగా ప్రేమించారు. ప్రేయసి ఆశా పేరును ఇద్దరు అన్నదమ్ములు పచ్చబొట్టు కూడా వేయించుకున్నారు.

ఆ అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన తర్వాత గానీ తెలియలేదు ఇద్దరూ ప్రేమిస్తుంది ఒకరినేనని. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు యువకుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా ఫోన్ సంభాషణలు, వాట్సప్ మెసేజ్ ‌ల ఆధారంగా ఇద్దరూ ఆ యువతితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో సదరు యువతి ఒకరికి తెలియకుండా మరొకరితో లవ్‌ ట్రాక్‌ నడిపిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఘటన జరిగిన తర్వాత యువతి కనిపించకుండా పోవడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుంది. అయితే అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకునే ముందు తమ చావుకు ఎవరూ కారణం కాదని చెబుతూ ఓ వీడియోను రికార్డ్‌ చేశారు. అలాగే, తాము ఇద్దరం ప్రేమిస్తున్న యువతికి మంచి అబ్బాయితో పెళ్లి చేయాలని వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. తమపై ఎవరి ఒత్తిడి లేదని, వ్యక్తిగత నిర్ణయంతోనే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు యువకులు వీడియోలో పేర్కొన్నారు. మా చావుకు ఎవరినీ నిందించవద్దని తెలిపారు.
Tags:    

Similar News