సంచలనంగా మారిన మిర్యాలగూడ వ్యాపారి మారుతిరావు ఆత్మహత్య నేపథ్యంలో.. అతనికి.. మారుతిరావు సోదరుడు శ్రవణ్ కు మధ్య గొడవలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనకు.. తన అన్నకు మధ్య ఎలాంటి గొడవలు.. విబేదాలు లేవని స్పష్టం చేసిన ఆయన.. ఇదంతా మీడియా ఊహించి రాస్తోందన్నారు.
తనకు.. తన అన్నకు మధ్య గొడవలు ఉన్నట్లుగా సాగుతున్న ప్రచారం మొత్తం మీడియా పుణ్యమేనన్నారు. ఉదయమే కారు డ్రైవర్ ఫోన్ చేసి విషయం చెబితే.. తన వదినను తీసుకొని హైదరాబాద్ బయలుదేరి వచ్చినట్లు చెప్పారు. హత్య కేసులో అనవసరంగా ఇరుక్కునానన్న ఉద్దేశంతో గత ఏడాది నుంచి తాను మాట్లాడటం లేదని.. అంతకు మించి తమ మధ్య మరింకేమీ లేదన్నారు. ఆస్తికి సంబంధించి వీలునామా రాసిన విషయం తనకు తెలీదన్నారు.
తన అన్నతో చివరగా మే 15న మాట్లాడానని.. నా కుటుంబం ఇబ్బందుల పాలైందన్న కోపంతోనే తాను అన్నతో మాట్లాడలేదన్నారు. లాయర్ ను పెట్టుకోవటానికి కూడా సమయం లేకపోవటంతో ఒత్తిడికి గురైనట్లుగా అభిప్రాయపడ్డారు. సూసైడ్ నోట్ లో ఏముందో తనకు తెలీదన్న ఆయన.. మిర్యాలగూడ షెడ్డులో దొరికిన డెడ్ బాడీతో తనకు సంబంధం లేదన్నారు.