జీఎస్టీ గుడ్ న్యూస్..కార్లపై భారీ డిస్కౌంట్స్‌

Update: 2017-06-06 16:37 GMT
గూడ్స్‌  సర్వీసు టాక్స్ పొట్టిగా జీఎస్‌ టీ...ఇప్ప‌టివ‌ర‌కు జీఎస్టీ అంటే న‌డ్డి విరిచే ప‌న్ను భారానికి ప్ర‌త్యామ్నాయంగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అదే జీఎస్టీ కార‌ణంగా ఓ తీపి క‌బురు ఒక‌టి వినిపిస్తోంది. అదే కార్ల‌పై డిస్కౌంట్లు ఇవ్వ‌డం. ఏకంగా ఒక్కో కారుపై రూ.10 వేల నుంచి రూ.30 వేల వ‌ర‌కు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది ఇప్ప‌టివ‌ర‌కు అందిస్తున్న డిస్కౌంట్ల‌కు అధ‌నం. ఇంత‌కీ ఎందుకీ డిస్కౌంట్లు అంటే... జులై 1నుంచి జీఎస్టీ అమ‌ల్లోకి రానున్న నేప‌థ్యంలో జూన్‌ నెలలో అమ్మకాలపై కన్నేసిన  డీలర్లు ఈ ప్రత్యేక  తగ్గింపును అందిస్తున్నాయి.

జూలై 1 నుంచి జీఎస్‌ టీ అమల్లోకి రానుండ‌టంతో  కొత్త పన్ను రేటు ప్రకారం, కార్లు మరియు ఎస్‌ యూవీల 4 మీటర్లు - పరిమాణంలో 1.5 లీటర్ కంటే ఎక్కువ డీజిల్ ఇంజిన్ ఉన్న వాటికి  ప్రస్తుత పన్ను రేటు 51.5 - 55 శాతంతో పోలిస్తే జీఎస్టీలో పన్నురేటు 28శాతం + సెస్ కలుపుకుంటే మొత్తం 48 శాతం పన్ను అమలుకానుంది. ఇలా ఎలక్ట్రిక్ వాహనాలు, పెద్ద ఎస్‌ యూవీలపై అధిక పన్ను రేటు వ‌ర్తించ‌నున్న నేపథ్యంలో డీలర్లు త‌మ ద‌గ్గ‌ర ఉన్న వాహ‌నాల‌ను ఇప్పుడే అమ్మేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. జూన్ 31 లోపు కొనుగోలు చేసిన  కస్టమర్లకు  నగదు రాయితీలను అందజేస్తున్నట్టు ఆఫ‌ర్లు పెట్టేస్తున్నారు. ఒక్కో కంపెనీ ఇందులో ఒక్కో స్లాబ్ రేట్‌ ను అందిస్తోంది.

--- దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాలైన‌ ఢిల్లీ - కోల్‌ కతాల్లోని మారుతి డీలర్లు ఆల్టో - వాగన్ ఆర్ - సెలెరియో - స్విఫ్ట్ వంటి వాహనాలపై న‌గ‌దు రాయితీల‌ను అందించ‌నున్నట్లు ప్ర‌క‌టించింది.

- మారుతి  వాగాన్ ఆర్ పై డిస్కౌంట్ గతంలో రూ.20వేలు ఉండ‌గా తాజాగా దాన్ని రూ.30వేలకు పెంచింది.

-స్విఫ్ట్‌ పై రూ. 10వేలనుంచి రూ.20వేలకు, సెలెరోపై రూ. 20వేల వరకు స్పెషల్‌ డిస్కౌంట్‌ అందిస్తోంది.

--హ్యుండాయ్ డీలర్లు త‌మ అమ్మ‌కాల గురించి వివ‌రిస్తూ అధ‌న‌పు డిస్కౌంట్లు అందిస్తున్న‌ట్లు తెలిపారు.

-- మహీంద్రా ఆండ్ మ‌హీంద్రా డీల‌ర్లు త‌మ కంపెనీకి చెందిన స్కార్పియో హైబ్రిడ్‌పై  రూ. 30,000 డిస్కౌంట్ ఇస్తున్న‌ట్లు తెలిపారు.

-- హుందాయ్‌ డీలర్లు తమ కార్లపై  డిస్కౌంట్లను రెట్టింపు చేశాయి. ఇయాన్‌, గ్రాండ్ ఐ10 పై తగ్గింపు రేటును ప్రకటించింది.

--జపాన్‌ కు చెందిన కార్ల త‌యారీ సంస్థ  టొయోటాకు చెందిన  ఇన్నోవా, ఫార్చూనర్‌ ధరలు కూడా దిగిరానున్న‌ట్లు చెప్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News