మూకుమ్మడిగా ఇండిగో ఉద్యోగుల బంక్ - సోషల్ మీడియాలో మీమ్ ఫెస్ట్

Update: 2022-07-05 10:36 GMT
ఎయిర్ ఇండియాలో పనిచేసేందుకు ఇతర కంపెనీల ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. అనారోగ్యం కారణంగా పెద్ద సంఖ్యలో సిబ్బంది సెలవుపై వెళ్లడంతో విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన 55 శాతం దేశీయ విమానాలు   ఆలస్యమైన విషయం తెలిసిందే.  ఇంత తీవ్రంగా కాకపోయినా.. ఇదే పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది.

భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో శనివారం విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంది. దాని క్యాబిన్ క్రూ ఉద్యోగులు చాలా మంది ఈ రోజు అనారోగ్య సెలవు తీసుకున్నారు. దీని కారణంగా వివిధ విమానాశ్రయాలలో సగానికి పైగా ఇండిగో విమానాలు ఆలస్యం అయ్యాయి.

ఇదిలా ఉండగా టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్‌లైన్ కంపెనీ 'ఎయిర్ ఇండియా' క్యాబిన్ క్రూ సభ్యుల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ఇదే రోజున ప్రారంభించింది. ఎయిర్ ఇండియా రిక్రూట్‌మెంట్‌కు హాజరయ్యేందుకు మాత్రమే ఇండిగో ఉద్యోగులు సామూహిక సిక్ లీవ్ తీసుకున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆరోపించారు. వారి సంఘటన తర్వాత ఇండిగోను ట్రోల్ చేస్తూ అనేక మీమ్స్ ఇంటర్నెట్‌ను నింపాయి.

డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్ స్పందించారు. ఇందుకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఎయిర్ ఇండియా రెండో దశ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ను శనివారం నిర్వహించిందని.. సిక్ లీవ్ తీసుకున్న ఇండిగో సిబ్బంది దానికి వెళ్లారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

మరోవైపు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనేక విమానాల ఆలస్యాలకు సంబంధించి ఇండిగో నుండి నివేదికను కోరింది. ఇంతలో ఈ సమస్యపై రూపొందించిన ఈ ఫన్నీ మీమ్‌లను చూడండి.

ఇండిగో ప్రస్తుతం రోజుకు 1600 దేశీయ, అంతర్జాతీయ విమానాలను నడుపుతోంది. పౌరవిమానయాన మంత్రిత్వశాఖ వెబ్ సైట్ ప్రకారం.. ఇండిగో దేశీయ విమానాలలో 45.2 శాతం శనివారం సమయానికి నడిచాయి.

తాజాగా ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, విస్తారా, గోఫస్ట్, ఎయిర్ ఏషియా ఇండియా విమానాలలో వరుసగా 77.1 శఆతం, 80.4 శాతం, 86.3 శాతం, 88 శాతం , 92.3 శాతం విమానాలు నడిచాయి.
Tags:    

Similar News