కరోనా వైరస్ గుర్తించడానికి వాడుతున్న డయాగ్నస్టిక్ కిట్లపై దేశవ్యాప్తంగా ప్రతీరోజూ ఏదో వివాదం బయటకి వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో చైనా నుంచి దిగుమతి చేసుకున్న కరోనా వైరస్ టెస్టింగ్ కిట్లను కేంద్రం 60 శాతం ఎక్కువ ధరకు కొనుగోలు చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. చైనా నుంచి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు దిగుమతి చేసుకున్న సంస్థ, పంపిణీదారు మధ్య తలెత్తిన వివాదంతో ఈ విషయం బయటపడింది.
రోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారీ ఎత్తున పరీక్షల నిర్వహణకు వీలుగా కేంద్ర ప్రభుత్వం మార్చి 27న చైనాలోని వోండ్ ఫో సంస్ధకు 5 లక్షల ర్యాపిడ్ కిట్ల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్ 16న చైనాలోని భారత రాయబారి విక్రమ్ మిస్రీ భారత్ కు ర్యాపిడ్ కిట్లతో పాటు యాంటీబాడీస్ టెస్టింగ్ కిట్లు - ఆర్.ఎన్.ఎ ఎక్స్ ట్రాక్షన్ కిట్లు కలుపుకుని మొత్తం 6.5 లక్షల కిట్లు పంపుతున్నట్లు సమాచారం ఇచ్చారు. దిగుమతిదారు మాట్రిక్స్ ఒక్కో టెస్టింగ్ కిట్ ను రూ. 245 కు కొనుగోలు చేస్తే.. వాటిని పంపిణీదారులు రియల్ మెటాబాలిక్స్ - ఆర్క్ ఫార్మాస్యూటికల్స్ ఒక్కో కిట్ రూ. 600 చొప్పున భారత ప్రభుత్వానికి అమ్మారు. అంటే దాదాపు 60 శాతం అధిక మొత్తం వసూలు చేశారు.
దిగుమతిదారు మాట్రిక్స్ నుంచి టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేసిన మరో పంపిణీదారు షాన్ బయోటెక్ ఒక్కో కిట్ రూ. 600 చొప్పున తమిళనాడు ప్రభుత్వానికి అమ్మింది. దీంతో విషయం వెలుగు చూసింది. తమతో చేసుకున్న అగ్రిమెంట్ కు వ్యతిరేకంగా దిగుమతిదారు మాట్రిక్స్ పనిచేసిందని రియల్ మెటాబాలిక్స్ ఢిల్లీ హైకోర్టు తలుపుతట్టింది. తమను పక్కనపెట్టి షాన్ బయోటెక్ ద్వారా తమిళనాడు ప్రభుత్వానికి టెస్టింగ్ కిట్లను అమ్మిందని కోర్టుకు తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు.. ప్రస్తుత తరుణంలో అధిక ధరలు వసూలు చేయొద్దని - జీఎస్టీతో కలిపి ఒక్కో కిట్ ను రూ.400 లకే అమ్మాలని స్పష్టం చేసింది.
చైనాకు చెందిన వోండ్ ఫో సంస్ధ ద్వారా దిగుమతి చేసుకున్న కిట్లకు 60 శాతం ఎక్కువ ధరను ఎలా చెల్లించారన్న ప్రశ్నకు ఐసీఎంఆర్ వద్ద సరైన సమాధానం లేదు. దీంతో ప్రస్తుత పరిస్దితుల్లో అవసరం, టెండర్ ధర ప్రకారమే వీటిని కొనుగోలు చేసినట్లు ఐసీఎంఆర్ చెబుతోంది. అలాగే , చైనా నుండి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల నాణ్యత ఎంత అంటే సమాధానం చెప్పే వారు లేరు. ఇప్పటికే వీటిని భారీ రేట్లతో కొనుగోలు చేసిన రాజస్దాన్ తో పాటు పలు రాష్ట్రాలు నెత్తీ నోరు బాదుకుంటున్నాయి. వీటితో ఫలితాలు సక్రమంగా రావడం లేదని ఐసీఎంఆర్ కు ఫిర్యాదులు కూడా చేశాయి. దీంతో ర్యాపిడ్ కిట్ల వాడకాన్ని మొన్నా మధ్య రెండు రోజుల పాటు నిలిపివేసిన సంగతి తెలిసింది.