దక్షిణ తైవాన్ లో గురువారం తెల్లవారుజామున ఓ 13 అంతస్తుల టవర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 46 మంది మృత్యు వాతపడ్డారు. పదుల సంఖ్యలో ప్రజలకు గాయాలయ్యాయి.కావోసియుంగ్ నగరంలో వాణిజ్య, నివాస సముదాయాలున్న ఈ టవర్‌లో చెలరేగిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందికి దాదాపు నాలుగు గంటలు పట్టింది.ప్రస్తుతం 79 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
అసలు ఈ అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందో తెలియడం లేదు. దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు ఇప్పటికే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు చెలరేగే ముందు పేలుడు జరిగినట్లు ఒక పెద్ద శబ్దం వచ్చిందని చుట్టుపక్కల ఉండే స్థానికులు వివరించారు. మరో 79 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య ఇంకాపెరిగే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
మంటలను అదుపులోకి తీసుచ్చిన రక్షణ, సహాయ దళాలు, బాధితుల కోసం గాలిస్తున్నారు. అగ్నిప్రమాదానికి ముందు పేలుడు శబ్దం వచ్చినట్లు పెద్ద శబ్దం వినిపించిందని సమీప నివాసితులు స్థానిక మీడియాకు తెలిపారు. భవన శిథిలాల్లో చిక్కుక్కున్న వారిని రక్షించేందుకు ఫైర్ సిబ్బంది నాలుగు గంటలకు పైగా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందనీ, భవనంలోనిని కింది అంతస్తుల్లో మంటలు చెలరేగినట్లు ఫైర్ సిబ్బంది వెల్లడించింది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉంది. ఈ టవర్‌లో దాదాపు 120 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. వీటిలో నివసిస్తున్నవారిలో చాలా మంది వృద్ధులు కూడా ఉన్నారు.