ఐపీఎల్ జోరుగా సాగుతోంది. నువ్వా నేనా అన్నట్టుగా మ్యాచ్ లు ఉత్కంఠ రేపుతున్నాయి. మ్యాచ్ లు టై అవుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. అయితే ఈ ఐపీఎల్ సీజన్ ఆరంభం నుంచి ఫిక్సింగ్ రూమర్లు వస్తున్నాయి.
ఐపీఎల్ లో మరోసారి ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ ఫిక్సింగ్ ఎలాగైనా చేయవచ్చనే వారి వాదనకు బలం చేకూరాలనే వాదన వినిపిస్తోంది.
నిన్నటి ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ దీనికి కారణంగా నిలుస్తోంది. ఢిల్లీ చేసిన ఫైనల్ స్కోరును ముంబై ఇండియన్స్ ట్విట్టర్ లో రివీల్ చేసిందంటూ ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అసలు మ్యాచ్ ఆరంభమైన తొలి ఓవర్ లోనే ఢిల్లీ చేయబోయే స్కోరును దాదాపు చేప్పేసిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీ 19.5 ఓవర్లలో 163/5 అంటూ ముంబై ఇండియన్స్ పేరుతో ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. ఢిల్లీ క్యాపిటల్స్ వారి ట్విట్టర్ అకౌంట్ లో దర్శనమిచ్చింది. ఇది పొరపాటున జరిగిందో లేక కావాలని చేశారో కానీ ఇది పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.
ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఓడిపోయింది. ముంబై ట్వీట్ లో ఉన్నట్టు ఢిల్లీ స్కోరు 162/4 కే పరిమితమైంది. ఇప్పుడు దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఫిక్స్ చేసుకొని ఆడతారా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇక ఢిల్లీ స్కోరును ముంబై మ్యాచ్ కు ముందే ఎందుకు ఇలా ట్విట్టర్ లో పెట్టిందనే దానిపై సోషల్ మీడియా చర్చ నడుస్తోంది. ఇది కచ్చితంగా మ్యాచ్ ఫిక్సింట్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఇది ముంబై ఇండియన్స్ చేసిన షేర్ కాదని.. మార్ఫింగ్ ఫొటో అనే వారు కూడా లేకపోలేదు.