సరోగసీ తల్లులకూ మాతృత్వ సెలవులు: ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

Update: 2022-01-09 17:30 GMT
ప్రసవానంతరం సరోగసి తల్లులకు కూడా మెటర్నిటీ లీవ్స్ జారీ చేయాలని ఏపీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వారు కూడా ఇతర తల్లులలాగే తమ పిల్లలను పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలని సూచించింది. ఓ మహిళ సరోగసి ద్వారా బిడ్డను కనగా లీవు మంజూరు చేయాలని తాను పనిచేసే చోట దరఖాస్తు చేసింది. అయితే సంస్థ ఆ దరఖాస్తును తిరస్కరించడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు వీరికి కూడా మాతృత్వ సెలవులు మంజూరు చేయాలని హైకోర్ట స్పష్టం చేసింది.

సాధారణంగా ఉద్యోగం చేసే ప్రతీ మహిళకు ప్రసవ సమయంలో, ఆ తరువాత సంస్థలు లీవులు మంజూరు చేస్తుంది. గర్భ మహిళలకు ఒక వరం లాంటింది. మహిళ గర్భం దాల్చినప్పుడు ఇతర పనులు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ప్రసవానంతరం తల్లీ, బిడ్డల మధ్య అనుబంధం జీవితాంతం కొనసాగుతూ ఉంటుంది. అయితే బిడ్డ పుట్టిన సమయంలో బిడ్డకు తల్లీ దగ్గర ఉండే ఆ బిడ్డకు శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. చాలా మంది తల్లులు తమ పిల్లలకు పాలు ఇవ్వడం ద్వారా వారు ఆరోగ్యంగా పెరుగుతారు.

అందువల్ల ఇలాంటి సమయంలో మహిళలకు సెలవులు మంజూరు చేయడం తథ్యం. యూనిసెస్ ప్రకారం అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లిదండ్రులు తీసుకునే సెలవులుచాలా ముఖ్యమైనవి. అవి వారి ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతాయి. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ, సౌకర్యాలను అందించేలా తోడ్పడుతాయని సూచించింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు ఆయా దేశాలను భట్టి సెలవులు మంజూరు చేస్తుంటాయి. మిగతా దేశాలతో  పోలిస్తే భారత్లో మహిళల సంరక్షన విషయంలో మెరుగే ఉందని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా సాధారణ ప్రసూతి సెలవుల విషయంలో ఏ సంస్థ అడ్డు చెప్పే సాహసం చేయదు.

అయితే తాజాగ సరోగసి ద్వారా బిడ్డను కనడం ద్వారా ప్రసూతి సెలవుల మంజూరుపై ఓ సంస్థ వెనకడుగు వేసింది. కాకినాడకు చెందిన ఓ మహిళ రంగరాయ మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె సరోసి ద్వారా కవల పిల్లలకు తల్లి అమ్యారు. అయితే ఆమె పనిచేసే కళాశాలకు మాతృత్వ సెలవులు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకుంది. అయితే కళాశాల యాజమాన్యం ఆమె దరఖాస్తును తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆమెకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.
Tags:    

Similar News